బీహార్‌లో ఆశ్చర్యకర సంఘటన చోటుచేసుకుంది. రైలు ప్రయాణికులను ఓ లోకో పైలట్ మధ్య వదిలేసి వెళ్లిపోయాడు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చకుండా మద్యంమత్తులో మునిగితేలాడు. వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌లోని సమస్తిపూర్ నుంచి లోకల్ రైలు సహర్సాకు బయలుదేరింది. గంట ప్రయాణం తర్వాత రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలుకు క్రాసింగ్ ఇచ్చేందుకు ఓ చోట ఆగింది. దీంతో లోకో పైలెట్ రైలు దిగి వెళ్లిపోయాడు. అయితే క్రాసింగ్ తర్వాత కూడా రైలు ఎంతకీ కదల్లేదు. దీంతో ప్రయాణికులు ఆందోళన చేయడంతో…
గత కొంత కాలంగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పేరు నిత్యం వార్తలలో వినిపిస్తోంది. కాంగ్రెస్‌లో చేరుతున్నారని హడావుడి చేశారు. ఇంతలో అదేం లేదని పీకే తేల్చేశారు. మరోవైపు, ఆయన ఇప్పటికీ టీఎంసీ, వైఎస్ఆర్సీపీ, డీఎంకే, టీఆర్ఎస్ వంటి పార్టీలకు కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ట్విటర్లో ఆయన చేసిన ప్రకటన రాజకీయ వర్గాలలో ఆసక్తిని రేపుతోంది. ప్రశాంత్ కిశోర్ తన తాజా ట్వీట్ ద్వారా పార్టీ స్థాపించే సంకేతం ఇచ్చానిపిస్తోంది. ఐతే అది ఎప్పడు…
ఇప్పుడు దేశమంతా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అడుగుల గురించే చర్చ సాగుతోంది. ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి. కాంగ్రెస్‌లో చేరేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో సొంత కుంపటి పెట్టుకుంటారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. నేడు ఆయన పార్టీని ప్రకటించనున్నట్టు కూడా ఉత్తరాది రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ట్విట్టర్లోనూ ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది. వ్యూహకర్త బాధ్యతల నుంచి తప్పుకుని ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగాలని, తన సత్తా ఏంటో…
ఏపీలో ప్రభుత్వ వైఫల్యం వల్లే రోజుకో మర్డర్… పూటకో రేప్ ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్. ఇలాంటి ఘటనలతో బీహారును ఏపీ మించిపోయింది. లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది.ఇవాళ ఓ వలసకూలీపై రేపల్లెలో అత్యాచారం జరిగింది. బతుకుదెరువు కోసం భర్త, పిల్లలతో వలసవెళ్లిన మహిళపై కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. రాష్ట్రంలో ఏంచేసినా పోలీసులు ఏమీ చేయలేరనే ధైర్యంతోనే ఉన్మాదులు ఇటువంటి దురాగతాలకు పాల్పడుతున్నారన్నారు లోకేష్. గత నాలుగు రోజులుగా…
చాలా రాష్ట్ర ప్రభుత్వాలు మద్యంపై ఆధారపడే నడుస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి.. ఇదే సమయంలో కొన్ని రాష్ట్రాల్లో మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్నారు.. బీహార్‌లో కూడా మద్యపాన నిషేధం అమలు చేస్తున్నారు.. ఇదే సమయంలో.. కల్తీ మద్యం తాగి మృతిచెందేవారి సంఖ్య కూడా పెరిగిపోతుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో సీఎం నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. మద్యం సేవించే వారందరూ మహా పాపులని అభివర్ణించిన ఆయన.. వారిని భారతీయులుగా తాను భావించనని పేర్కొన్నారు..…
ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే కార్పొరేట్ ఆస్పత్రికి పరుగులు పెడుతున్న రోజులివి. కానీ సర్కారీ ఆస్పత్రుల్లో అంతకుమించిన సౌకర్యాలు వున్నాయి. ఎంతోమంది మహిళా ఉన్నతాధికారులు ప్రభుత్వాసుపత్రిలోనే డెలివరీకి వెళుతున్నారు. తాజాగా ఓ జంట ప్రభుత్వాసుపత్రి వైద్యుల సహకారంతో తల్లిదండ్రులయ్యారు. అదికూడా ఎంతో ఖరీదుగా భావించే ఐవీఎఫ్ పద్దతి ద్వారా ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. బిహార్ రాజధాని పట్నాలోని ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ఆసుపత్రిలో ఈ అరుదైన సంఘటన జరిగింది. రాష్ట్ర చరిత్రలోనే…
సర్పంచ్ అంటే ఊరిలోని ప్రజలందరికీ రక్షణగా నిలవాల్సిన వ్యక్తి.. కానీ, అతడే వేధింపులకు పాల్పడుతున్నాడు.. ఒకే కుటుంబంలోని ముగ్గురు బాలికలను వేధింపులకు గురిచేశాడు.. ఇక, తమను వేధిస్తున్నాడని అతని ఇంటిముందు నిరసనకు దిగిన యువతి ముక్కు కోసిన దారుణమైన ఘటన బీహార్‌లో జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సుపౌల్ జిల్లా లోధ్లో గ్రామ సర్పంచ్ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ముగ్గురు యువతులు ఆరోపించారు. అతని ఇంటి ముందు ధర్నాకు దిగారు. దీంతో కోపంతో ఊగిపోయిన సర్పంచ్ ఓ…
అపాయం కలిగినపుడే ఉపాయం ఆలోచించాలి. మెదడు షార్ప్‌గా పనిచేయాలి. లేదంటే ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. చాలా మంది తాము ప్రమాదంలో చిక్కకున్నామని తెలిసిన వెంటనే ఏం చేయాలో తెలియక కాళ్లు చేతులు వణికిపోతాయి. ఆ సమయంలో ఆలోచనలు ఆగిపోతాయి. పొంచిఉన్న ప్రమాదం దూరంగా ఉన్నప్పటికీ దగ్గరికి వచ్చేస్తుందని భావించి తప్పించుకోలేక దానికి చిక్కి జీవితాన్ని నాశనం చేసుకుంటాము. Read: Russia-Ukraine War: భయాందోళనలో ఉక్రెయిన్ ప్రజలు… రష్యా ఆ బాంబును ప్రయోగిస్తుందా? అయితే, బీహార్‌లోని…
చిన్నపిల్లలు చిన్నచిన్న నాణేలను తెలియకుండా మింగేస్తుంటారు. ఇక కొంతమంది బంగారం ఇతర వస్తువులను మింగేస్తుంటారు. అయితే, బీహార్ చెందిన ఓ వ్యక్తి ఏకంగా చాయ్‌గ్లాస్‌ను మింగేశాడు. కడుపు నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించారు. కడుపులో ఏదో వస్తువు ఉందని గమనించిన వైద్యులు ఎండోక్కోపీ విధానం ద్వారా పరీక్షించగా, కడుపులో గ్లాసు ఉన్నట్టు గుర్తించారు. మలద్వారం ద్వారా బయటకు తీసుకురావాలని ప్రయత్నించినా కుదరకపోవడంతో వెంటనే ఆపరేషన్ చేసి గ్లాసును బయటకు తీశారు. అయితే ఆ వస్తువును ఎలా మింగాడు…
మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు రాంచీలోని సీబీఐ కోర్టు జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.. దాణా స్కామ్‌కు సంబంధించిన ఐదో కేసులో లాలూని దోషిగా తేల్చిన కోర్టు… ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.. జైలు శిక్షతో పాటు రూ.60 లక్షల జరిమానా కూడా విధించింది.. అయితే, లాలూ ప్రసాద్ యాదవ్‌పై కేసుల విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీహార్ సీఎం నితీష్ కుమార్… ఆయనపై కేసులు పెట్టింది మేం కాదన్న ఆయన..…