Election Rigging: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎట్టకేలకు ఎన్నికల వ్యూహకర్త, జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ మౌనం వీడారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓటమి చాలా బాధిస్తుంది.
Bihar: బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. 243 స్థానాలు ఉన్న బీహార్లో ఏకంగా 202 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. నితీష్ కుమార్ జేడీయూ 85 స్థానాలను గెలుచుకుంది. ఇదిలా ఉంటే, ప్రతిపక్ష ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి ‘‘మహాఘట్బంధన్’’ కేవలం 35 స్థానాలకే పరిమితమైంది. ఇందులో ఆర్జేడీ 25 స్థానాలే దక్కించుకుని ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. ఇదిలా ఉంటే, నవంబర్ 20న మరోసారి నితీష్ కుమార్ సీఎంగా…
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించింది. సర్వేల అంచనాలకు మించి సునామీ సృష్టించింది. తిరుగులేని శక్తిగా ఎన్డీఏ కూటమి చరిత్ర సృష్టించింది. ఈ విజయం కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని తీసుకొచ్చింది. కూటమిలో ఉన్న పార్టీలన్నీ ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఎంజాయ్ చేస్తున్నాయి.
2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి రాకెట్ వేగంతో దూసుకెళ్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగానే.. ఎన్డీయే కూటమి జోరు చూపిస్తోంది. ప్రస్తుతం వెలువడుతోన్న ఫలితాల ప్రకారం.. ఆధిక్యంలో మ్యాజిక్ ఫిగర్ (122)ను దాటేసి 200లకు పైగా స్థానాల్లో ముందంజలో ఉంది. ఎన్డీయే కూటమి విజయం ఖాయం కావడంతో పలువురు నేతలు స్పందిస్తున్నారు. తాజాగా బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ.. ఇది ప్రజలిచ్చిన అనుకూల తీర్పు అని పేర్కొన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ సమర్ధవంతమైన…
ప్రశాంత్ కిషోర్.. రాజకీయ ఎన్నికల వ్యూహకర్త. దేశ వ్యాప్తంగా ఆయా పార్టీలకు వ్యూహకర్తగా పని చేశాడు. తన వ్యూహాలతోనే ఆయా రాష్ట్రాల్లో అధికారంలో తీసుకొచ్చినట్లుగా కబుర్లు చెబుతుంటారు. కానీ సొంత రాష్ట్రంలో మాత్రం చతికిలపడ్డారు.
Bihar Election Results: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సంచలన విజయాన్ని నమోదు చేయబోతున్నట్లు ఫలితాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఓట్ల కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి బీజేపీ, జేడీయూలు అంతకంతకు మెజారిటీని పెంచుకుంటూ పోతున్నాయి. 2020 ఎన్నికలతో పోలిస్తే బీజేపీ కూటమి అఖండ విజయానికి చేరువైనట్లు ఫలితాలు తెలియజేస్తున్నాయి.
రేపే బీహార్ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 8 గంలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ పత్రాలు లెక్కింపు ఉండగా.. అనంతరం ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. ఇక ఢిల్లీ పేలుడు నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్ల దగ్గర ఈవీఎంలకు గట్టి భద్రతా ఏర్పాటు చేశారు.
బీహర్లో మలి విడత పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ బూత్ల దగ్గర క్యూ కట్టారు.
బీహర్లో మరికాసేపట్లో మలి విడత పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చివరి విడత పోలింగ్ కూడా ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేశారు.