Student Gets 151 Out Of 100 Marks In bihar: బీహార్ లో ఓ విద్యార్థికి వంద మార్కులకు గానూ 151 మార్కులు రావడం దేశవ్యాప్తంగా వైరల్ అయింది. బీహార్ దర్భాంగాలోని లలిత్ నారాయణ్ మిథిలా యూనివర్సిటీ నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఇటీవల లలిత్ నారాయణ్ మిథిలా యూనివర్సిటీ ఫలితాలు విడుదలయ్యాయి. గరిష్ట మార్కులు 100 వందకు వంద మార్కులో లేక పోతే 99 మార్కులో వస్తాయి. అయితే ఈ యూనివర్సిటీ వాళ్లు మాత్రం ఓ విద్యార్థికి 100కు 151 మార్కులు ఇచ్చారు. బీఏ పొలిటికల్ సైన్స్ హానర్స్ నాలుగో పేపర్ లో ఓ విద్యార్థికి ఇలాగే మార్కులు వచ్చాయి. ఇదిలా ఉంటే ఈ యూనివర్సిటీ పరిధిలోని ఎంకేఎస్ కాలేజీలో చదువుతున్న సోనూ కుమార్ కు ఓ పేవర్ లో సున్నా మార్కులు వచ్చినా.. మార్క్ షీట్ లో మాత్రం పాసైనట్లు కనిపిస్తోంది. దీంతో యూనివర్సిటీ నిర్వాకంతో విద్యార్థులు ఆయోమయానికి గురవుతున్నారు.
Read Also: komatireddy Rajgopal Reddy: కోమటి రెడ్డి వ్యవహారంపై ఢిల్లీలో కాంగ్రెస్ కీలక భేటీ
అయితే తప్పులను వెంటనే సరిదిద్దినట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ముస్తాక్ అహ్మద్ తెలిపారు. టైపింగ్ తప్పుల వల్లే ఫలితాలు మారాయిని వెల్లడించారు. కాగా ఈ వివాదంపై బీహార్ విద్యా శాఖ మంత్రి విజయ్ చౌదరి స్పందించారు. ఇది పొరపాటున జరిగిందని.. సమస్యలను సృష్టించాల్సిన అవసరం లేదని.. సిస్టమ్స్ ఫీడింగ్ లో లేదా టైపింగ్ మిస్టేక్స్ కావచ్చని మంత్రి అన్నారు. దీనికి బాధ్యుడైన వ్యక్తిని త్వరలోనే గుర్తిస్తామని మంత్రి అన్నారు.