Amit Shah and JP Nadda: బీహార్‌లో అమిత్‌షా.. పదేపదే తెలంగాణ ప్రస్తావన..! ఏంటి విషయం..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్‌షా.. తన బీహార్ పర్యటనలో పదే పదే తెలంగాణ ప్రస్తావన తీసుకువచ్చారు.. పాట్నాలో జరిగిన వివిధ మోర్చాల జాతీయ సమావేశాల్లో పాల్గొన్న షా.. తెలంగాణ బీజేపీ శాఖ చేస్తున్న పోరాటాలను ప్రస్తావించారు… తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాలను, ఉద్యమాలను అమిత్‌షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పదే పదే ప్రస్తావించారు. తెలంగాణలో చేస్తున్న పోరాటాల స్ఫూర్తితో మోర్చాల నేతలు పనిచేయాలని పిలుపునిచ్చారు.. అంతేకాదు.. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్న పేర్కొన్నారు అమిత్‌షా..
Read also: Raja Singh: యోగి కాళ్ళు నొక్కండి..! సీఎం గారు.. కొద్దిగా గైడెన్స్ వస్తుంది..
Also Read
- Advertising Rules: తెలంగాణలో ప్రకటనలపై(యాడ్స్) సర్కార్ కొత్త రూల్స్.. ఉత్తర్వులు జారీ..
- Harish Rao: రాష్ట్రంలో ఒకవైపు కరెంట్ కోతలు.. మరోవైపు కరెంటు బిల్లులతో వాతలు..
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
బీహార్ రాష్ట్రం పాట్నాలో నాలుగు రోజుల పాటు అంటే జులై 28 నుండి 31వ తేదీ వరకు వివిధ మోర్చాల జాతీయ సంయుక్త సమావేశాలు జరిగాయి.. ఈ సమావేశాలకు హాజరైన అమిత్‌షా, జేపీ నడ్డా.. తెలంగాణలోని 119 నియోజకవర్గాల పరిధిలో ఇటీవల జాతీయ నాయకులు రెండు రోజులపాటు క్షేత్ర స్థాయిలో పర్యటించిన విషయాన్ని ప్రస్తావించారు.. తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ చేస్తున్న పోరాటాలను పదేపడే ప్రస్తావించారు అగ్రనేతలు, తెలంగాణలో జరుగుతున్న కార్యక్రమాలను పలుమార్లు ప్రస్తావించడంతో చపట్లతో హర్షం వ్యక్తం చేశారు వివిధ మోర్చాలకు చెందిన తెలంగాణ నాయకులు.. బీహార్‌లో రెండోసారి విజయవంతంగా అధికారంలోకి వచ్చిన విషయాన్ని కూడా సమావేశంలో పేర్కొన్నారు. కాగా, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో జెండా పాతేయడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది బీజేపీ.. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్ వేదికగా నిర్వహించడం.. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగసభ నిర్వహించి సత్తా చాటారు.. సభ వేదికపై నుంచి జనాన్ని చూసిన ప్రధాని నరేంద్ర మోడీ.. బండి సంజయ్‌ని అభినందించిన విషయం తెలిసిందే.. ఇక, గత రెండు మూడు పర్యటనల్లోనూ.. బీజేపీ తెలంగాణ చీఫ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు అమిత్‌షా.
తాజావార్తలు
-
BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
-
Pakistan Cricket: గోల్డ్ మెడల్ వదిలేసి.. ఆ సిక్సరే హైలైట్ అంటున్న పాక్ క్రికెట్!
-
Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
-
AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
-
Advertising Rules: తెలంగాణలో ప్రకటనలపై(యాడ్స్) సర్కార్ కొత్త రూల్స్.. ఉత్తర్వులు జారీ..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!