ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతున్న భట్టి విక్రమార్క పాదయాత్ర.. ఇవాల దస్నాగూడ రైతులతో చర్చించుకుంటూ ముందుకు సాగుతున్నారు. సాగునీరు అందక జొన్న చేను ఎండిపోతుందని జొన్న కంకులు తీసుకువచ్చి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చూపించి గంగాధర్ అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణా రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చెయ్యటానికి కాంగ్రెస్ పార్టీ సరికొత్త కార్యక్రమంలో ముందుకు పోతుంది. ఈనేపథ్యంలో.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర 25వరోజుకు చేరింది.