Bhatti Vikramarka: ప్రజల కోసమే నా పాదయాత్ర.. వారి బాధలను ప్రభుత్వానికి చెప్పేందుకే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. మంచిర్యాల జిల్లా భీమారం మండలం బూరగుపల్లిలో ఆయన యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోసమే ఈ పాదయాత్ర అని.. కాంగ్రెస్ పార్టీ కోసమో.. ఎన్నికల కోసమో… చేస్తున్న యాత్ర కాదన్నారు. తెలంగాణ లక్ష్యాలు నెరవేరనందున ప్రజలు పడుతున్న బాధలను ఈ ప్రభుత్వానికి చెప్పడానికే రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నానన్నారు. నాలుగు కోట్ల ప్రజల చెందాల్సిన సంపదను నలుగురు ఉన్న కేసీఆర్ కుటుంబ సభ్యులు దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ పరిపాలనలో వ్యవసాయానికి సాయమే లేదన్నారు.
రైతుబంధు పేరిట కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన రాయితీలు, ప్రోత్సాకాలను అన్ని బంద్ చేశారని విమర్శించారు. మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన ధనిక రాష్ట్రంలో 9 ఏళ్లవుతున్న కొలువులు రాలేదని, డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదన్నారు. పావలా వడ్డీలు రాలేదు, రుణమాఫీ పూర్తి కాలేదు, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రాలేదు, దళితులకు మూడు ఎకరాలు ఇవ్వలేదని ఈ సందర్భంగా తెలిపారు. 18 లక్షల కోట్ల సంపద, తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి తెచ్చిన 5 లక్షల కోట్లు కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు దోపిడీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. చెన్నూరు నియోజకవర్గంలోని దాంపూర్ నుంచి బూరుగుపల్లి వరకు తాను నడిచి వచ్చిన రోడ్లు కంకర తేలి గతుకుల మయంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ రోడ్డుకు నిధులు మంజూరైనప్పటికీ తొమ్మిదేళ్లుగా ప్రభుత్వం పూర్తి చేయలేదన్నారు.
Also Read
- Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
- Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
- OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
- Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
భీమారం ప్రాంతానికి గొల్లవాగు నుంచి 9500 ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు కాంగ్రెస్ నిర్మాణం చేస్తే కాలువలు మెయింటెనెన్స్ చేయలేని దుస్థితిలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని భట్టి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టుతో చెన్నూరులో సస్యశ్యామలం చేసేందుకు పనులు ప్రారంభించారన్నారు.
Read Also: Congress leader booked: ప్రధాని మోడీపై విమర్శలు.. కాంగ్రెస్ నేతపై కేసు..!
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్ధాంతరంగా పనులను నిలిపివేసి ప్రాజెక్టు రీ డిజైన్ చేయడం వల్ల చెన్నూరుకు సాగునీరు అందని పరిస్థితి నెలకొందన్నారు. చెన్నూరుకు సాగునీరు అందకపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వ విధానమే కారణమన్నారు. తొమ్మిదేళ్లు అవుతున్న చెన్నూరు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తికాలేదన్నారు. సింగరేణి ఉద్యోగులను ప్రభుత్వం రోడ్డుపాలు చేస్తోందన్నారు. 1,05లక్షల ఉద్యోగుల నుంచి 42 వేలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం కుదించిందన్నారు. 60 వేల మంది స్థానికుల ఉద్యోగులను బీఆర్‌ఎస్ ప్రభుత్వం రోడ్డుపాలు చేసిందన్నారు. సింగరేణి క్వార్టర్స్ రెగ్యులరైజ్ చేస్తామని ఇచ్చిన హామీని సర్కారు విస్మరించిందన్నారు. సింగరేణిలో కొత్త ఉద్యోగాలు సృష్టించడంలో బీఆర్ఎస్ వైఫల్యం చెందిందన్నారు. చెన్నూరు నుంచి వందల లారీల ఇసుకను తరలిస్తున్నది ప్రభుత్వ పెద్దలు కాదా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ వనరులను కొంతమంది మాత్రమే దోపిడీ చేస్తున్నారన్నారని భట్టి విక్రమార్క మండిపడ్డారు. కాలేశ్వరం ప్రాజెక్టు వల్ల చెన్నూరు పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలు వరదలతో మునిగిపోతున్న ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.
Read Also: KTR letter to Centre: వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కుట్రలు ఆపండి! కేంద్రానికి కేటీఆర్ బహిరంగ లేఖ
విద్యార్థి నాయకుడిగా చెప్పుకునే చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ఎమ్మెల్యేగా గెలిచి ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించారని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. రాష్ట్రంలో 1.92 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్న విషయం తెలియదా అని ప్రశ్నించారు. లేక ఒక నోటిఫికేషన్ వేసి ప్రశ్న పత్రం లీకేజీ చేసి నిరుద్యోగుల లక్ష్యాలను బీఆర్‌ఎస్ ప్రభుత్వం అంధకారం చేసిందన్నారు. బాల్క సుమన్ నిజమైన విద్యార్థి నాయకుడైతే ప్రశ్న పత్రం లీకేజీపై బయటకు వచ్చి మాట్లాడాలన్నారు. విద్యార్థుల పోరాటానికి బాల్క సుమన్ అండగా ఉండాలన్నారు. పేపర్ లీకేజీకి పాల్పడిన ప్రభుత్వ పెద్దలు రాజీనామా చేయాలని బాల్క సుమన్ డిమాండ్ చేయాలన్నారు. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయం వచ్చినప్పుడల్లా కేసీఆర్ కొత్త పథకాలు తీసుకొస్తారని భట్టి అన్నారు. ముందస్తు ఎన్నికల ముందు ఇస్తామన్న నిరుద్యోగ భృతి నాలుగు సంవత్సరాలు అవుతున్న అమలు చేయకుండా కేసీఆర్ మోసం చేశారని ఆయన విమర్శలు గుప్పించారు. నిరుద్యోగ యువతీ యువకులందరికీ నిరుద్యోగ భృతిని లెక్క కట్టి వారి ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే టీఎస్పీఎస్సీ ద్వారా పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి ఖాళీలన్నిటిని భర్తీ చేస్తామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!