కొమురం భీం జిల్లా జైనూర్ మండలంలోని జంగాం గ్రామంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటించారు. స్వయం సహాయక మహిళ సంఘాలకు రూ.3.41 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కులతో పాటు ఇందిరమ్మ ఇళ్ల కు సంబంధించిన పత్రాలు అందజేశారు. ఈ సంద్భంగా భట్టి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడమే కాదు వారం వారం బిల్లు ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ లబ్ధి దారులు ఏ ఒక్కరోజు ఆలస్యం చేయకండి. వడివడిగా ఇండ్లు కట్టుకోండి..…
ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలోని రావినూతల గ్రామం సాక్షిగా తెలంగాణ రాష్ట్రంలో ఒక సరికొత్త సోలార్ విప్లవానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శ్రీకారం చుట్టారు. ఈ పథకం ప్రధాన ఉద్దేశం ప్రతి ఇంటిని ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మార్చడమేనని, ఇకపై ప్రజలు విద్యుత్ శాఖకు బిల్లులు చెల్లించే రోజులు పోయి, విద్యుత్ శాఖే ప్రజలకు డబ్బులు చెల్లించే రోజులు వచ్చాయని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం అత్యంత భారీగా…
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి , ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మల్లు కోరారు. శనివారం నాడు న్యూఢిల్లీలోని అశోకా హోటల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ‘ప్రి-బడ్జెట్’ సమావేశంలో ఆయన పాల్గొని తెలంగాణ ప్రభుత్వ విన్నపాలను కేంద్రం ముందుంచారు. 2047 నాటికి దేశాన్ని 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న లక్ష్యంలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని,…
రాష్ట్రంలో సోలార్ పవర్‌ను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాలన్న దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గృహ అవసరాలకే కాకుండా వ్యవసాయ రంగానికి కూడా సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో పలు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. శాసన మండలిలో ఈ అంశంపై మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్య ఘర్ పథకానికి ప్రజల నుంచి అనుకున్నంత స్థాయిలో స్పందన రావడం లేదని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే…
Bhatti Vikramarka : తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. శాసనసభకు వచ్చే ధైర్యం లేని వారు, బయట ఉండి అడ్డగోలుగా మాట్లాడటం తగదని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన గొప్ప తీర్పు అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. “రాష్ట్రంలోని 85…
Telangana : సంక్షేమ శాఖలలో పెండింగ్ లో ఉన్న బకాయిలు అన్ని ఒకేసారి విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వ కాలం నుంచి పెండింగ్ లో ఉన్న బిల్లుల బకాయిలు క్లియర్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రయోజనం కలిగేలా ప్రజా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని భట్టి విక్రమార్క అన్నారు. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ.. విద్య విషయంలో ప్రభుత్వం ఎక్కడా రాజీ పడదని ఆయన…
Bhatti Vikramakra : తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ రంగ ఉద్యోగులకు, ఆర్టిజన్లకు , పెన్షనర్లకు ప్రభుత్వం భారీ ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ మార్కెట్లో పెరుగుతున్న ధరల సూచిని దృష్టిలో ఉంచుకుని, వీరికి రావాల్సిన డియర్ నెస్ అలవెన్స్ (DA) , డియర్ నెస్ రిలీఫ్ (DR) ను 17.651 శాతంగా ఖరారు చేస్తూ విద్యుత్ శాఖ అధికారులు రూపొందించిన ప్రతిపాదనలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారికంగా ఆమోద ముద్ర వేశారు. ప్రతి…
చంద్రబాబు పాలనలో ఉత్తరాంధ్రకు మహర్దశ పట్టింది చంద్రబాబు పాలనలో ఉత్తరాంధ్రకు మహర్దశ పట్టిందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. విశాఖలో జీఎంఆర్, మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యూ సిటీ ఒప్పంద కార్యక్రమంలో అయ్యన్నపాత్రుడు పాల్గొని మాట్లాడారు. ఇన్నేళ్లుగా వెనుకబడిందని చెప్పుకుంటూ వచ్చిన ఉత్తరాంధ్రకు మహర్దశ పట్టిందని తెలిపారు. ఉత్తరాంధ్రకు ఎన్టీఆర్ గుర్తింపు తెస్తే.. అభివృద్ధి మాత్రం చంద్రబాబు హయాంలో జరుగుతోందని చెప్పారు. అభివృద్ధి ప్రణాళికల అమల్లో చంద్రబాబే నిద్రపోనివ్వరంటే.. ఇప్పుడు లోకేష్ అసలే పడుకోనివ్వడం లేదన్నారు. పార్టీలు.. రాజకీయాల కోసం…
Bhatti Vikramarka : ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో ఇటీవల ఎన్నికైన సర్పంచులను డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్తగా ఎన్నికైన సర్పంచులు గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. గ్రామాల్లో పారిశుధ్యం, విద్య, వైద్య సేవల మెరుగుదలపై సర్పంచులు ప్రధానంగా దృష్టి సారించాలన్నారు. రాజకీయాలకు అతీతంగా పనిచేస్తూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాల్సిన బాధ్యత సర్పంచులపై ఉందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని…