Bhatti Vikramarka : సీఎం కేసీఆర్ కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బహిరంగ లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ సీఎం కేసీఆర్ కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బహిరంగ లేఖ రాశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం పోలంపల్లి గ్రామంలో పాదయాత్రలో లేఖను సీఎల్పీ నేత విడుదల చేశారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు మార్చి 16 నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మొదలు పెట్టినట్లు ఆయన వెల్లడించారు. 18 రోజులుగా ఆదిలాబాద్, ఆసీఫాబాద్, మంచిర్యాల జిల్లాలో పాదయాత్ర చేస్తొన్న నాకు వేల మంది గిరిజనులు, ఆదివాసీలు కలిసి వారు ఎదుర్కొంటున్న పోడు భూముల సమస్యను వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేసిన పోడు పట్టాల భూములను బిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి ద్వారా హక్కులు కోల్పోయామని, తమ భూముల్లోకి రాకుండా అటవి అధికారులు పెడుతున్న ఇబ్బందులను చెప్పి కన్నీటి పర్యంతమయ్యారని లేఖలో పేర్కొన్నాడు.
Also Read : Janhvi: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనవడితో తిరుపతిలో కనిపించిన జాన్వీ…
Also Read
- PM Kisan: రైతులకు బిగ్ అలర్ట్.. మీ అకౌంట్లోకి రూ.2,000 రావాలంటే ఈ పని తప్పనిసరి..!
- CM Chandrababu: కరవు సీమ నుంచి కలల సాకారం వైపు.. సీఎం కీలక వ్యాఖ్యలు
- Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
- Chhattisgarh: నల్లగా, లావుగా ఉన్నానంటూ నా భార్య నన్ను ఎగతాళి చేస్తోంది.. నాకు విడాకులు ఇవ్వండి..
ఉమ్మడి జిల్లాలైన ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, నల్గొండ తదితర జిల్లాల్లో పోడు చేసుకుంటున్న రైతులకు తక్షణమే పట్టాలు పంపిణీ చేయాలి.. పోడు పట్టాలపై 2014 నుంచి మీరు, మీ ప్రభుత్వం చేస్తున్న ప్రకటలన్నీ నీటిమీద రాతలుగా మారాయని సీఎం కేసీఆర్ కు రాసిన లేఖలో తెలిపాడు. పోడు భూముల సమస్యలను 2014, 2018 సాధారణ, నాగార్జున సాగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో మీరు అస్త్రంగా వాడుకుని గెలిచిన తరువాత మరిచిపోయిన అంశాన్ని గిరిజనులు గుర్తుపెట్టుకున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.
Also Read : Murder: ఇంటికి రమ్మని భార్య ప్రియుడికి భర్త ఫోన్.. నమ్మి రాగానే నరికేశారు
నాటీ మీ టీఆర్ఎస్ 2018 ఎన్నికల మేనిఫెస్టోలో సైతం పోడు భూముల అంశాన్ని ప్రస్తావించారు. 2019 మార్చిలో జరిగిన శాసనసభ సమావేశాల సాక్షిగా పోడు భూములు చేసుకుంటున్న గిరిజనులకు హక్కు పత్రాలు ఇస్తామని ప్రకటించారని భట్టి విక్రమార్క గుర్తుచేశారు. 2019 జులై 19న అసెంబ్లీలో గిరిజనులకు పోడు భూముల పట్టాలు ఇచ్చేందుకు అక్కడే కుర్చీ వేసుకుని కూర్చుంటానని ప్రకటించారు. గత ఫిబ్రవరిలో జరిగిన సమావేశాల్లో 11.50 లక్షల ఎకరాకలు పోడు భూములకు పట్టాలిస్తామని కేసీఆర్ ప్రకటించారు.. ఆర్థిక శాఖామంత్రి హరీష్ రావు గత నెల 9న జరిగిన మంత్రివర్గ సమావేశాల్లో లక్ష 55 వేల 393 మందికే మొదటి విడతలో హక్కు పత్రాలు ఇస్తామని ప్రకటించారు.. కానీ ఇప్పటి వరకు దానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.
Also Read : Justice Radhakrishnan Away : తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి కన్నుమూత
నాలుగు లక్షల మంది గిరిజనులు హక్కు పత్రాల కోసం ఎదురుచూస్తుంటే 1.5 లక్షల మందికే పట్టాలిస్తామడం.. గిరిజనులను నిట్టనిలువునా మోసం చేయడమే.. కేంద్ర అటవి హక్కుల చట్టం ప్రకారం అడవిపై, అటవి ఫలాలపై, పోడు భూములపై గిరిజనులకు పూర్తి హక్కులున్నాయి.. గిరిజనులకు ఉన్న హక్కులను ప్రభుత్వం కాలరాయడం క్షమించరాని నేరం అని సీఎల్పీ నేత భట్టి అన్నారు. ఎన్ని లక్షల ఎకరాలపై, ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారో జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా ప్రభుత్వం జాబితాను విడుదల చేయాలి.. పోడు భూముల సమస్యలపై పోరాడుతున్న గిరిజనులు, ఆదివాసీలపై బనాయించిన తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలి.. పోడుభూముల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలి.. పోడు భూముల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయకుంటే కాంగ్రెస్ పార్టీ విడుదల చేస్తుందని సీఎల్సీ నేత భట్టి విక్రమార్క అన్నారు.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్డేట్..
-
Rs50,000 FD for Third Child: కొత్త పథకం.. మూడో సంతానం పుడితే భారీ ప్రోత్సాహం.. రూ.50 వేల ఫిక్స్డ్ డిపాజిట్
-
PM Kisan: రైతులకు బిగ్ అలర్ట్.. మీ అకౌంట్లోకి రూ.2,000 రావాలంటే ఈ పని తప్పనిసరి..!
-
CM Chandrababu: కరవు సీమ నుంచి కలల సాకారం వైపు.. సీఎం కీలక వ్యాఖ్యలు
-
Chhattisgarh: నల్లగా, లావుగా ఉన్నానంటూ నా భార్య నన్ను ఎగతాళి చేస్తోంది.. నాకు విడాకులు ఇవ్వండి..
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!