హాత్ సే హాత్ జోడో అభియాన్ పేరిట సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో నేడు కొమురంభీం జిల్లాలో ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణినీ తీసుకువచ్చి దొరలకు మళ్ళీ భూములను కట్టబెట్టి, రైతుల నడ్డి విరిచిందని ఆరోపించారు. అంతేకాకుండా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఉపయోగపడేలా మార్పులు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో నిరుద్యోగులకు తీరని ద్రోహం చేశారని ఆయన మండిపడ్డారు.
Also Read : Maha Kumbabishekam: శ్రీశైలంలో మహా కుంభాభిషేకం.. ప్రధాని, సీఎంకు ఆహ్వానాలు..!
నిరుద్యోగులు ఆత్మస్థైర్యాన్ని కొల్పొకండని ఆయన వ్యాఖ్యానించారు. వాళ్ళు ఖర్చు చేసిన ప్రతి ఒక్క రూపాయి వారికి ప్రభుత్వం చెల్లించాలని భట్టి డిమాండ్ చేశారు. బాధ్యులు ఎవరైనా వారిని కఠినంగా శిక్షించాలన్నారు భట్టి. పెద్దలను కాపాడటం కోసమే ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష నేతలకు సిట్ నోటీసులు ఇస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయని, అధికారులు తమ కర్తవ్యాన్ని మరిచి, బానిసల్లాగా మారకూడదని ఆయన హితవు పలికారు. పేపర్ లీక్ చేసిన పెద్దలను సిట్ పిలవాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read : Kamar Film Factory: ఔత్సాహిక ఫిల్మ్ మేకర్స్ కోసమే… కమర్ ఫిల్మ్ ప్యాక్టరీ గ్రాండ్ లాంచ్..