Bhatti vikramarka: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 16వ రోజు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతుంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. బెల్లంపల్లి నుంచి లంబాడ తండా బట్వాన్ పల్లి, పెరకపల్లి, గుండ్ల సోమవారం, నార్వాయిపేట, మెట్పల్లి వరకు పీపుల్స్ మార్చ్ సాగనుంది. మధ్యాహ్నం పెరకపల్లిలో లంచ్ బ్రేక్ అనంతరం రాత్రికి మెట్పల్లిలో బస చేయనున్నారు. ఈనేపథ్యంలో.. మంచిర్యాలలో భట్టి విక్రమార్క పాదయాత్ర చేరుకోగా.. భట్టిని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినులు కలిసారు. వారి సమస్యలను చెప్పుకున్నారు. వారికి ష్కాలర్ షిప్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాల భవనం సరిపోవడం లేదని తెలిపారు. హాస్టల్ భవనం ఇక్కడకు రెండు కిలోమటర్ల దూరంలో ఉంటుందని భట్టితో పేర్కొన్నారు. అక్కడనుంచి ఇక్కడకు ప్రతిరోజూ నడుచుకుంటూ రావాలంటే ఇబ్బందిగా ఉందని విద్యార్థులు భట్టితో తెలిపారు.
Read also: Postpartum Depression : ప్రసూతి నిర్వేదం(పోస్ట్ పార్టమ్ డిప్రెషన్) లక్షణాలు… అధిగమించండిలా…
ఇక్కడే మాకు హాస్టల్ భవనం నిర్మించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక్కడ 800 మంది విద్యార్థులు చదువుతున్నారని, సరైన టాయిలెట్లు లేవు. ల్యాబ్ సౌకర్యం లేదు, గ్రౌండ్ లేదని ఆవదేన వ్యక్తం చేశారు. మౌలిక సదుపాయాల లేకపోవడం వల్ల వరండాల్లోనే చదువుకోవాల్సి వస్తోందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థినులకు బస్ సదుపాయం లేకపోవడం కాలేజీ వచ్చేందుకు ఇబ్బందిగా ఉందని తెలిపారు. తాగేందుకు మంచి నీటి వసతి లేదు. అంతేకాక బెల్లంపల్లిలోనే పీజీ కాలేజ్ ఏర్పాటు చేయాలని విద్యార్థునులు భట్టికి వినతి పత్రం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ విద్యా, వైద్యానికి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చిందని, కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక విద్య, వైద్యానికి నిధులు వెచ్చించడం లేదని మండిపడ్డారు. కొత్త కాలేజీలే ఏర్పాటు చేయడం లేదని, కాంగ్రెస్ హాయంలోనే హైదరాబాద్ ఐఐటీ, త్రిపుల్ ఐటీలు, కొత్త కాలేజీలు, యూనివర్సిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇక్కడ సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ పోరాటం చేస్తానని భట్టి విక్రమార్క విద్యార్థులకు హామీ ఇచ్చారు.
Shakuntalam: ఇంతందం కనిపిస్తుంటే అభిమానుల మనసు నిలుపతరమా?