హాత్ సే హాత్ జోడో పేరిట భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మోతుగూడ మండలంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్ర సంపాదనను బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుంటుందన్నారు. ప్రశ్నపత్రం లీకేజీ చేసిన ప్రభుత్వ పెద్దలకు శిక్ష పడేంతవరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని, నిరుద్యోగులారా గొంతు ఎత్తి అరవండి మీ ఆశలు, హక్కులను కాల రాసిన బిఆర్ఎస్ ప్రభుత్వం పై పోరాడండన్నారు. విద్యార్థి, నిరుద్యోగులు చేసే పోరాటానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, రాహుల్ పై అనర్హత వేటు వేసిన బీజేపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపుదామని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటి స్థలాలు లేనివారికి ప్లాట్లు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు సాయం చేస్తామన్నారు.
Also Read : Sreemukhi: అయితే క్లివేజ్.. లేకపోతే థైస్.. ఏంటి పాప ఈ చూపించడం
అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇచ్చి అమ్మ హస్తం పథకం తీసుకొచ్చి తొమ్మిది సరుకులు పంపిణీ చేస్తామని, రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్స్ నిర్మాణం చేస్తామన్నారు. ఏడో తరగతి విద్యార్థి చైతన్య నా వద్దకు వచ్చి తమ పాఠశాలలో టాయిలెట్స్ లేకపోవడం వల్ల పడుతున్న ఇబ్బందులు చెప్పినప్పుడు చాలా ఆవేదన గురయ్యాననని, చైతన్య మాదిరిగానే రాష్ట్రంలో ఉన్న విద్యార్తులు ఎదుర్కొంటున్న ఈ సమస్య పైన రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం నిధులను దళిత గిరిజనుల, అభివృద్ధికి ఖర్చు చేస్తామని, రానున్న 2023 24 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వస్తుందన్నారు.
Also Read : South Africa vs West Indies: టీ20ల్లో వరల్డ్ రికార్డ్.. 259 లక్ష్యాన్ని ఛేధించిన సౌతాఫ్రికా