సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ చేశారు. ఇవాల హైదరాబాద్లోని భట్టి విక్రమార్క నివాసంలో పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు సమావేశంపై ఆరాతీసిన ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మీ వెంటే నేనుంటా అని తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ల నిర్ణయానికి కోమటిరెడ్డి మద్దతు తెలిపారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ లో అగ్గిరాచినటైంది.
వలస వాదులతో అసలు వారికి నష్టం జరిగిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కాంగ్రెస్ లో పుట్టి. పెరిగి భావజాలం నమ్మిన అనేక మందికి కమిటీ ఏర్పాటులో ఇబ్బంది ఏర్పడిందని అన్నారు.
దేశంలో స్వేచ్ఛ లేకుండా పోయిందని, ప్రశ్నిస్తే కేసులు, వాళ్ళు చెప్పితే మాట్లాడాలి, ప్రచారం చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. భారత్ రాజ్యాంగం ఆమోదించుకున్న రోజు దీనిని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు.