తెలంగాణ వెలిగిపోతుందని, 24 గంటల ఉచిత కరెంటు మా ప్రభుత్వం వల్లనే వస్తుందని గొప్పలు చెబుతున్న కేసీఆర్ తొమ్మిదేళ్లుగా ఒక్క పవర్ ప్రాజెక్ట్ అయినా ఎందుకు కట్టలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టిన పవర్ ప్రాజెక్టుల వల్లే ఇప్పుడు 24 గంటల ఉచిత విద్యుత్తును బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తోందని ఆయన అన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బహిరంగ లేఖ రాశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం పోలంపల్లి గ్రామంలో పాదయాత్రలో లేఖను సీఎల్పీ నేత విడుదల చేశారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. మంచిర్యాల జిల్లా భీమారం మండలం బూరగుపల్లిలో ఆయన యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
మంచిర్యాలలో పీపుల్స్ మార్చ్ సందర్భంగా భట్టి విక్రమార్క వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. లిక్కర్ స్కాం పై భట్టి విక్రమార్క హాట్ కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. ఢిల్లీ తరహాలో తెలంగాణ లో లిక్కర్ స్కాం జరుగుతుందని మండిపడ్డారు. లోతుగా విచారణ చేపట్టితే బయట పడుతుందని అన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 16వ రోజు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతుంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభమైంది.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కోదండరామస్వామి ఆలయంలో జరిగిన సీతారాముల వారి కల్యాణంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఆలయంలో స్వామివారికి భట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు ఆలయ చైర్మన్ రేణిగుంట్ల శ్రీనివాస్ , ధర్మకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.