MLA Seethakka : గన్నేరువరం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీలో చేరికల కార్యక్రమం, బహిరంగ సభకు ములుగు ఎమ్మెల్యే సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొననున్నారు.
ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన బీజేపీ కార్యక్రమం అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఏం సంబంధం, ఎలా హాజరవుతారని ప్రశ్నించారు.
బీసీ లకు పెద్ద పీట వేసే పార్టీ బీజేపీ నే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. జ్యోతి రావు పూలే జయంతి సందర్బంగా.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పూలే చిత్రపటానికి బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మన్, బండి సంజయ్, బీజేపీ నేతలు నివాళులు అర్పించారు.
10వ తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రిమాండ్ రద్దుపై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. దీంతో బీజేపీ వర్గాల్లో ఉత్కంఠ వాతావరణం సాగనుంది.
రాంజీగోండు చరిత్రను వెలుగులోకి తెస్తామని బీజేపీప రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ బండి సంజయ్ అన్నారు. అలే నరేంద్ర వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి బండి సంజయ్, బీజేపీ నేతలు నివాళులు అర్పించారు.