Minister Jagadish Reddy: 25 ఏళ్లుగా నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉన్న గుజరాత్ రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క అవార్డు రాలేదని విమర్శించారు మంత్రి జగదీష్ రెడ్డి. కోదాడ పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన బీజేపీపై విమర్శలు గుప్పించారు.
Bandi Sanjay: ఈడీ వస్తుందంటే కాలు విరుగుతుంది, సీబీఐ వస్తుందంటే దుబాయి వెళ్తారు, ఇలాంటి నాయకులు బీఆర్ఎస్ లో ఉన్నారంటూ ఫైర్ అయ్యారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. వరంగల్ లో జరిగిన నిరుద్యోగ మార్చ్ లో పాల్గొన్న ఆయన బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ పై పలు విమర్శలు గుప్పించారు. ఇదే వరంగల్ గడ్డపై తనను అరెస్ట్ చేశారని, కేసీఆర్ కి బలగం కేవలం కొడుకు, కూతురు, అల్లుడే అని, బీజేపీకి బలగం తెలంగాణ ప్రజలని…
టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీకి వ్యతిరేకంగా బీజేపీ ఆధ్వర్యంలో శనివారం వరంగల్‌లో నిరుద్యోగ యాత్ర నిర్వహించనున్నారు. పేపర్ల లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాలని, రూ.లక్ష పరిహారం ఇవ్వాలని డిమాండ్లతో భారీ ర్యాలీ చేపట్టనున్నారు.
అక్కడ పనులు ఆగిపోతే పనులు ప్రారంభించాలని బీజేపీ వార్నింగ్ ఇస్తేనే ఈ రోజు విగ్రహం పూర్తి అయ్యిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి బండి సంజయ్, బీజేపీ నేతలు నివాళులు అర్పించారు.
MLA Seethakka : గన్నేరువరం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీలో చేరికల కార్యక్రమం, బహిరంగ సభకు ములుగు ఎమ్మెల్యే సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొననున్నారు.
ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన బీజేపీ కార్యక్రమం అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఏం సంబంధం, ఎలా హాజరవుతారని ప్రశ్నించారు.