పదో తరగతి హిందీ పరీక్షా పత్రం లీకేజీ వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే.. ఈ లీకేజీ కేసులో తెలంగాణ బీజేపీ చీఫ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే బండి సంజయ్ వరంగల్ సీపీ రంగనాథ్ విమర్శలు గుప్పించారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై సీపీ రంగనాథ్ స్పందిస్తూ..
బండి సంజయ్ నన్ను టార్గెట్ చేశారన్నారు. కేసులో ముద్దాయిగా ఉన్న వారు పోలీసుల తీరును తప్పుపట్టడం సహజమని, ఆయన లేవనెత్తిన అలిగేషన్ చేయని వారు ఇప్పుడే ఎందుకు అలిగేషన్ చేస్తున్నారన్నారు. ఉక్రోషంతో చేసినట్టుగా భావిస్తున్నామని, సత్యంబాబు కేసులో ఏం చేశారు… ఖమ్మం, నల్గొండ లో ఏం చేశారో తెలుసన్నారు. బాధితులు సైతం బండి సంజయ్ ని సంప్రదించారట. సంప్రదించిన వారిలో ల్యాండ్ మాఫియా, లోఫర్ డాఫర్ చీటర్స్ పిడి యాక్ట్ బాదితులై ఉంటారు. తప్పు చేసినవాడిని శిక్షిస్తే ఆరోపణలు చేస్తారు. అక్రమ ఆస్తులు సంపాదించినట్లు నిరూపిస్తే ఉద్యోగం వదిలిపోతా. రాజకీయాలకు అతీతంగా ఉద్యోగం చేశాను. సెటిల్ మెంట్ దందాలు చేసేవారిని క్షమించను. దళారులు దందాలు చేసేవారు నా వద్దకు రారు. రోజుకు 50 నుంచి 60 గ్రీవెన్స్ చూస్తాను. ఈటలను విచారణకు పిలిస్తే వచ్చి వివరాలు ఇచ్చారు. అయేషా కేసులో సత్యంబాబు ను విచారించాను. బండి సంజయ్ నన్ను ప్రమాణం చేయమన్నారు. ప్రమాణం చేసే ఉద్యోగం లో చేరాను. ప్రమాణం చేయాలంటే ప్రతి కేసులో చేయాల్సి ఉంటుంది. అశాస్త్రీయమైన ప్రమాణం చేయాలా? కాల్ డేటా తీసుకోవాల్సిన అవసరం లేదంటున్నారు గౌరవ ఎమ్మెల్యే రఘునందన్ రావు. దయచేసి ఈ కేసును రాజకీయంగా చూడవద్దు. పేపర్ లీక్ కాదు… మాల్ ప్రాక్టీస్ కేసుగా మాత్రమే చూస్తున్నాం. ఏ సెటిల్ మెంట్ దందాలు చేయను. కేసు విషయంలో సాక్షాలు సెకరించి చట్టపరంగా చర్యలు చేపడుతాం. అనివార్యమైన పరిస్థితిలోనే ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. బండి సంజయ్ తనపై అలిగేషన్ చేయడం బెదిరిస్తున్నట్లు భావిస్తున్నా. విచారణ లో పాక్ట్ వచ్చేసరికి కేసు మారుతుంది.
Also Read : TMC: తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసి లూయిజిన్హో ఫలేరో..
బండి సంజయ్ ఫోన్ మా దగ్గరికి రాలేదు. కరీంనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత అర్థరాత్రి ఒంటిగంట 14 ని.లకు బెజ్జంకి టవర్ పరిధి లో ఫోన్ స్విచ్చాఫ్ అయింది. బండి సంజయ్ పరువు నష్టం కేసు వేస్తే ఆధారాలతో ఎదుర్కొంటాం. అనవసరంగా కేసు పెట్టలేదు… మా దగ్గర ఆధారాలతో ముందుకు వెళ్తాం. ఈ కేసు ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేలా ఉంది. తమ విచారణకు ఆటంకం కలిగించినట్లైతే బెయిల్ కండిషన్ ఉల్లంఘించినట్లే. తన ప్రెస్ మీట్ పై బండి సంజయ్ స్పందించినా ఇక నేను స్పందించను. సెంటిమెంట్ ను చట్టాలతో ముడిపెట్ట వద్దు. చట్టం తనపని తాను చేసుకుంటూ పోతుంది అని రంగనాథ్ అన్నారు.
Also Read : Vetrimaaran: ఎన్టీఆర్- అల్లు అర్జున్ మల్టీస్టారర్.. రివీల్ చేసిన స్టార్ డైరెక్టర్..?