Bandi sanjay: 10వ తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రిమాండ్ రద్దుపై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. దీంతో బీజేపీ వర్గాల్లో ఉత్కంఠ వాతావరణం సాగనుంది. సంజయ్ రిమాండ్ రద్దు చేయనున్నారా? లేక రిమాండ్ తరలించనున్నారా? అనే విషయం పై ఇవాళ హైకోర్టులో తేలనుంది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 10వ తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో విచారణ కొనసాగుతోంది. ఇదే కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టయి ఆ తర్వాత బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నెల 4న కమలాపూర్ జెడ్పీ బాలుర నుంచి హిందీ ప్రశ్నపత్రం వాట్సాప్‌లో బయటకు వచ్చిన ఘటనలో సూత్రధారిగా భావిస్తున్న బండి సంజయ్‌పై పోలీసులు నేరపూరిత కుట్ర, మోసం, మాల్ ప్రాక్టీస్ తోపాటు పలు కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత అరెస్టు చేసి ఈ నెల 6న హనుమకొండ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా.. మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు రిమాండ్‌పై కరీంనగర్ జైలుకు తరలించారు. అనంతరం సుదీర్ఘ వాదనల అనంతరం హనుమకొండ మెజిస్ట్రేట్ బండి సంజయ్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సంజయ్ 7వ తేదీ ఉదయం కరీంనగర్ జైలు నుంచి విడుదలయ్యారు. వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ విచారణను నేటికి వాయిదా వేశారు. దీంతో సంజయ్ రిమాండ్ రద్దుపై హైకోర్టు నేడు విచారణ చేపట్టనుంది.
కరీంనగర్ జిల్లా జైల్లో ఉన్న బండి సంజయ్ కి ఈనెల 6న రాత్రి బెయిల్ మంజూరైంది. సుదీర్ఘ వాదోపవాదాల తరువాత షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరు జామీనుతో పాటు రూ.20వేల పూచీకత్తుతో నిన్న రాత్రి 10 గంటలకు రిలీజ్ ఆర్డర్ కోర్టు ఇచ్చింది. సాక్షులను ప్రభావితం చేయవద్దని సాక్ష్యాలను చేరిపివేయవద్దని, దేశం విడిచి వెళ్లొద్దని న్యాయస్థానం షరతులు విధించింది. ప్రశ్నా ప్రతాల లీకేజీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సంజయ్ కి హనుమకొండ కోర్టు 14 రోజుల రిమాండ్‌ను విధించిన విషయం తెలిసిందే.
Son Killed Father: ఆస్తి వివాదంలో వృద్ధుడి హత్య.. కొడుకు, మనవడి కోసం వెతుకులాట