Bandi Sanjay: కరీంనగర్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించిందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు మొత్తం రూ.50 కోట్లు విడుదల చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇందులో కేంద్ర వాటా రూ.40 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ నిధులతో కరీంనగర్ రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయని అన్నారు. స్మార్ట్ సిటీ, స్వచ్ఛ భారత్, అమృత్ తదితర వివిధ కేంద్ర…
బీఆర్ ఎస్ పదేళ్ల పాలనలో, కాంగ్రెస్ రెండేళ్ల పాలన ఫలితంగా తెలంగాణలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ చిన్నాభిన్నమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో 6 వేల స్కూల్స్ మూసివేస్తే… కాంగ్రెస్ పాలనలో వాటిని తెరవకపోగా ఒక్క ఏడాదిలోనే 1500 స్కూల్స్ మూసివేశారని చెప్పారు. ప్రతి విద్యార్ధికి 5 లక్షల భరోసా కార్డు ఇస్తామని గాలికొదిలేశారని, ఫీజు రీయంబర్స్ మెంట్ రాక కాలేజీలు మూతపడుతున్నా పట్టించుకోవడం లేదని…
కృష్ణా జలాల గురించి మాట్లాడే హక్కు మాజీ సీఎం కేసీఆర్‌కు లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు దృష్టి మళ్లించడానికి కృష్ణా జలాల అంశం కేసీఆర్ లేవనెత్తుతున్నారని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా తానే అపెక్స్ కౌన్సిల్ సమావేశం పెట్టించా అని చెప్పారు. ఇక కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేయడాన్ని బండి సంజయ్ తప్పుబట్టారు. కేసీఆర్‌పై సీఎం రేవంత్ మాట్లాడిని భాష సరికాదన్నారు. ఈరోజు మీడియా చిట్‌చాట్‌లో బండి సంజయ్…
తెలంగాణలో మేము అధికారంలోకి వస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ ను దేశం నుంచి తరిమి కొట్టాలి.. దేశంలో మూడు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది.. ఏపీలో కూకటి వేళ్ళతో పెకిలించి సముద్రంలో కలిపారు..
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే… ఆ గ్రామాభివ్రుద్ది కోసం ప్రత్యేకంగా రూ.10 లక్షల నిధులను అందజేస్తానని కేంద్ర మంత్రి ప్రకటించారు. తాను ఒక్కసారి మాట ఇస్తే తప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ ప్రజలను ఏకం చేసి అభివ్రుద్ధి వైపు ద్రుష్టి సారించేలా ప్రోత్సహించేందుకే ఈ నిధులను ప్రకటించాలని…
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కోటి యాభై లక్షల రూపాయల సిఎస్సార్ నిధులతో కొనుగోలు చేసిన అత్యాధునిక వైద్య పరికరాలను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు.
Off The Record: తెలంగాణ కమలం లొల్లి ఇప్పట్లో కొలిక్కి రాదా? ఎడ్డెమంటే తెడ్డెమనే నైజం మారదా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో అది మరింత ముదిరిందా? ఓ వైపు డిపాజిట్ కూడా దక్కకుండా జనం కర్రుగాల్చి వాత పెట్టినా.
KCR: ప్రముఖ కవి, 'జయ జయ హే తెలంగాణ' ఉద్యమ గీత రచయిత, డాక్టర్ అందెశ్రీ మరణం పట్ల తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వారి మరణం పట్ల విచారం తెలుపుతూ తన సంతాపం ప్రకటించారు.
Bandi Sanjay: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్‌సీఏలో జరుగుతున్న జూనియర్ సీనియర్ సెలెక్షన్ల పై సీరియస్ అయ్యారు.. గ్రామీణ స్థాయి క్రికెటర్లకు అవకాశం కల్పించకపోవడంపై వివరాలు సేకరించారు. సెలక్షన్ కమిటీలో ఉన్న సభ్యులపైన యాక్షన్ ఉండబోతుందని హెచ్చరించారు.. రాచకొండ కమిషనర్ కి సైతం సమాచారం ఇచ్చినట్లు స్పష్టం చేశారు. సెలక్షన్ కమిటీ సభ్యులు.. హైదరాబాద్‌లో ఉన్న నైపుణ్యం లేని క్రికెటర్లకి అవకాశం…
Bandi Sanjay: జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మీటింగ్‌కు పోలీసులు అనుమతి రద్దు చేశారు. షెడ్యూల్ ప్రకారం ఈరోజు సాయంత్రం బోరబండలో కొనసాగాల్సిన బండి సంజయ్ మీటింగ్‌ను నిలిపేశారు. పోలీసుల తీరుపై బీజేపీ శ్రేణుల మండిపడుతున్నారు. అనుమతి ఇచ్చి రద్దు చేయడమేంటని బీజేపీ ఎన్నికల ఇంఛార్జీ ధర్మారావు ప్రశ్నించారు.