ఎలాంటి ఎమోషన్స్ కూడా లేని ఈ ప్రభుత్వానికి బలగం సినిమా చూపించాలని బండిసంజయ్ సతీమణి అపర్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా బండి సంజయ్ తో జిల్లా జైలులో కుటుంబ సభ్యులు వెళ్లి కలిసారు.
బండి సంజయ్ లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. హనుమకొండ కోర్టు డాకెట్ ఆర్డర్‌ను సస్పెండ్ చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. అరెస్టు సమయంలో పోలీసులు 41ఎ నోటీసు జారీ చేయలేదని పేర్కొన్నారు.
హిందీ పేపర్ ను పోటో తీసిన అతనికి బీజేపీ కి ఉన్న సంబందం ఏందని, పరీక్ష కేంద్రం వద్ద ఒక పోలీస్ కూడా లేడా? అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు.
తెలంగాణ పదో తరగతి పేపర్ లీకేజీ కేసు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మెడకు చుట్టుకుంది. 10వ తరగతి పరీక్షల ప్రశ్నపత్రం లీక్ చేసినందుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
పదో తరగతి పేపర్ లీకేజీ కుట్రలో ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పేపర్ లీక్ అంశంలో బీజేపీ నేతల ప్రమేయంపై ఆయన మండిపడ్డారు. కొత్త రాష్ట్రం అయినప్పటికీ తెలంగాణ దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు.