K Laxman: బీసీ లకు పెద్ద పీట వేసే పార్టీ బీజేపీ నే అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మన్ అన్నారు. జ్యోతి రావు పూలే జయంతి సందర్బంగా.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పూలే చిత్రపటానికి కే.లక్ష్మన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ నేతలు నివాళులు అర్పించారు. బీజేపీ రాజ్య సభ సభ్యుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. 50 శాతం పైగా ఉన్న బీసీ లో కోసం మోడీ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. పూలే ఆశయాలను నెరవేర్చుతున్నాడని తెలిపారు. దేశ వ్యాప్తంగా లక్ష గ్రామాలు, కోటి కుటుంబాలను ఓబీసీ మోర్చా అధ్వర్యంలో కలుస్తాం… మోడీ కార్యక్రమాలు వివరిస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ కుటుంబం బీసీలను చిన్న చూపు చూసిందని ఆరోపించారు. వారి చెప్పు చేతుల్లో ఉండాలని అనుకుందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ నీ కులం పేరుతో, చాయ్ అమ్ముకున్నందుకు హేళన చేస్తున్నారని మండిపడ్డారు.
Read also: Extramarital Affair: జ్యోతిష్యుడి మెడకు చుట్టుకున్న ఎఫైర్.. పక్కా స్కెచ్ వేసి బలి
ఆర్థిక పరమైన రిజర్వేషన్ లు ఉండాలని కులాల పరంగా ఉందొద్దని అన్న వ్యక్తి రాజీవ్ గాంధీ అన్నారు. మోడీ బీసీలకు రిజర్వేషన్ లు అమలు చేస్తున్నారన్నారు. BC లను వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలుగా తయారు చేయాలని అనేక కార్యక్రమాలు మోడీ చేపట్టారని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ బీసీలను పాలనలో భాగస్వామ్యం కాకుండా బీసీ రిజర్వేషన్ లు కుదించాడని ఆరోపించారు. బీసీ వ్యతిరేక విధానాలకు కేసీఆర్ పాల్పడుతున్నారని తెలిపారు. బీసీ కార్పొరేషన్ లకు ఫ్యాన్ లు లేవు, ప్యూన్ లు లేరని ఎద్దేవ చేశారు. ఒక శాతం ఉన్న సామాజిక వర్గానికి నాలుగు మంత్రి పదవులు ఇచ్చిన సీఎం…50 శాతం పైగా ఉన్న బీసీ లకు మూడు ఇచ్చారన్నారు. బీసీ లకు పెద్ద పీఠ వేసే పార్టీ బీజేపీ నే అని తెలిపారు. కులం పేరుతో తరతరాలుగా అణచివేతకు గురైన దళిత, బడుగు, బలహీనవర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు, గొప్ప సంస్కర్త జ్యోతిరావ్ గోవిందరావు అన్నారు. 1873లో సత్య శోధక్ సమాజ్ స్థాపించి ఎన్నో సేవలు అందించారు. కార్మికుల హక్కుల కోసం కూడా పోరాడారని గుర్తు చేశారు.
Today Business Headlines 11-04-23: ఒక కంపెనీ కోసం 49 సంస్థల ఆసక్తి. మరిన్ని వార్తలు