Ambedkar statue was completed only when BJP gave a warning: అక్కడ పనులు ఆగిపోతే పనులు ప్రారంభించాలని బీజేపీ వార్నింగ్ ఇస్తేనే ఈ రోజు విగ్రహం పూర్తి అయ్యిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి బండి సంజయ్, బీజేపీ నేతలు నివాళులు అర్పించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్న పార్టీ బీజేపీ అని అన్నారు. 370 ఆర్టికల్ ను, దేశ విభజనను వ్యతిరేకించిన వ్యక్తి అంబేడ్కర్ అని తెలిపారు. అంబేడ్కర్ ను అడుగడుగున అవమానించిన పార్టీ కాంగ్రెస్.. ఆయనను ఓడించిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. దళితలను పారిశ్రామిక వేత్తలుగా ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అని తెలిపారు. మోడీ పాలనలో సంక్షేమ పథకాలు దళితులకు అందుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి , ఆయన కుటుంబం అంబేడ్కర్ ను గౌరవించిన పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: US intelligence leak: అమెరికా రహస్యాలు లీక్.. 21 ఏళ్ల యువకుడు అరెస్ట్
అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు ను బీజేపీ వ్యతిరేకించడం లేదన్నారు. అక్కడ పనులు ఆగిపోతే పనులు ప్రారంభించాలని బీజేపీ వార్నింగ్ ఇస్తేనే ఈ రోజు విగ్రహం పూర్తి అయ్యిందని బండి సంజయ్ తెలిపారు. సీఎం దళిత ద్రోహి, ఆయనకు విగ్రహం ఆవిష్కరించే అర్హత లేదన్నారు. ఇన్ని రోజులు అంబేడ్కర్ జయంతి వర్ధంతి లకి ఎందుకు హాజరు కాలేదో సీఎం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. దళిత బందు పై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. MLC ఎన్నికలు ఉన్నాయని పీవి నర్సింహ రావు విషయంలో ఇలానే చేశారని అన్నారు. హడావుడి చేసి ఆ తర్వాత ఆయనను పట్టించుకోలేదని ఆరోపించారు.
Dog Attack: వ్యక్తి ప్రైవేట్ భాగాన్ని కొరికిన పిట్‌బుల్.. విషమంగా బాధితుడి ఆరోగ్యం..