రాజస్థాన్ లో అసెంబ్లీ ఎన్నికలకు అన్ని ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. త్వరలో ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కానుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అయితే, నాయకుల మధ్య అంతర్గత విభేదాలు పార్టీకి మైనస్ గా మారింది. ముఖ్యంగా సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య చెలరేగిన వివాదం తారా స్థాయికి చేరింది.
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. కొరియా దేశానికి చెందిన బ్లాగర్‌ను ఓ యువకుడు వేధించాడు. ఒంటరిగా కనిపించిన ఆ యువతితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. కొరియన్ యువతిని ఫాలో అయ్యి రెచ్చిపోయాడు. కొరియన్ బ్లాగర్ తన కెమెరాలో అక్కడి ప్రదేశాలను చిత్రీకరిస్తుండగా.. ఆ యువకుడు తన దుస్తులు విప్పి, వికృతంగా నవ్వుతూ ప్రైవేట్ పార్ట్స్ బయటకు తీసి చూపించాడు. ఆ యువకుడి వెకిలి చేష్టలతో ఆ యువతి భయపడిపోయింది.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ రాజస్థాన్ కాంగ్రెస్ లో నెలకొన్న విభేదాలు కలవర పెడుతున్నాయి. అధికార కాంగ్రెస్ లో సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య వివాదం ముదురుతోంది.
ఇటీవల బీజేపీ నేత, మాజీ సీఎం వసుంధర రాజే అవినీతిపై చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రస్తావిస్తూ సచిన్ పైలెట్ దీక్ష చేపట్టారు. దీంతో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్ల మధ్య మరోసారి విభేదాలు బయటకు వచ్చాయి. ఈ సమస్యను సద్దుమణిగేలా చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తోంది.
రాజస్థాన్‌లోని అధికార కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం కొనసాగుతోంది. సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య వార్ పతాక స్థాయికి చేరింది. సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సచిన్ పైలట్ చేసిన నిరాహార దీక్షతో గెహ్లాట్ ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందిగా మారింది.
కాంగ్రెస్, బీజేపీల మధ్య రాజకీయ వైరం ఉంది. ముఖ్యంగా మోడీ సర్కార్ పై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. ప్రజా వ్యతిరేక విధానాలపై విమర్శలు గుప్పిస్తోంది. ప్రధాని మోడీ కూడా సభలు, పలు అభివృద్ధి కార్యక్రమాల సందర్భంగా విపక్షాల విమర్శలను తిప్పికొడుతున్నారు.
రాజస్థాన్‌లో సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా బహిరంగ నిరసనకు దిగిన కాంగ్రెస్ యువనేత సచిన్ పైలట్ ఇవాళ హస్తినకు వెళ్తున్నారు. గత బీజేపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ నిన్న సచిన్ పైలట్ నిరాహార దీక్ష చేశారు.
కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ ఈరోజు జైపూర్‌లో తన సొంత ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని తన నిరసన నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. పార్టీ వ్యతిరేక చర్యకు దిగొద్దని హైకమాండ్ హెచ్చరించినా.. కాంగ్రెస్ పెద్దల ఆదేశాలన్ని పైలట్ ధిక్కరించారు.
రాజస్థాన్ లో అధికార కాంగ్రెస్ లో పార్టీ నేతల మధ్య పోరు కొనసాగుతోంది. సీఎం స అశోక్ గెహ్లాట్ వర్సెస్ సచిన్ పైలట్ గా మారింది. గత కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో సచిన్ పైలట్ నిరాహారదీక్షకు దిగడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
ఈ ఏడాది చివర్లో రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున సచిన్ పైలట్తో విభేదాల చర్చలను ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శనివారం తోసిపుచ్చారు. అయితే అన్నీ పార్టీల మాదిరాగానే కాంగ్రెస్లో చిన్న చిన్న విభేదాలు ఉంటాయని ఆయన అన్నారు.