Cylinder Blast: పెళ్లిలో పేలిన సిలిండర్.. 32మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cylinder Blast: రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాలో వివాహ వేడుకలో సిలిండర్ పేలిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 32కి పెరిగింది. మరో నలుగురు వ్యక్తులు ఇక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. జోధ్‌పుర్‌లోని భుంగ్రా గ్రామంలో పెళ్లి వేడుక జరుగుతున్న ఇంట్లో డిసెంబర్ 8న గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో 50 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 32 మంది చనిపోయారు. మిగతా వారు జోధ్‌పుర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Read Also: Atrocity in Maharashtra: అయ్యో బిడ్డా ఆ నొప్పిని ఎలా భరించావురా! 11 మంది 10 గంటలు అత్యాచారం
Also Read
- Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Biscuit Recipe: ఓవెన్ అవసరం లేదు.. కడాయితోనే బేకరీ స్టైల్ బిస్కెట్లు ఇంట్లోనే.. తయారీ విధానం చాలా ఈజీ!
సీఎం అశోక్ గహ్లోత్ ఇంకా ఈ గ్రామాన్ని గానీ, ఆస్పత్రిని గానీ సందర్శించకపోవడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం అందించాలని, గ్యాస్ కంపెనీపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ ఘటనపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ ఆరోపించింది. పేలుడు జరిగిన గ్రామాన్ని సీఎం ఇంకా సందర్శించలేదని ధ్వజమెత్తింది. ఇంత విషాద సమయంలో కాంగ్రెస్ మ్యూజిక్ కన్‌సర్ట్ నిర్వహించిందని మండిపడింది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం జైపూర్‌లో మ్యూజిక్ కన్‌సర్ట్ నిర్వహించింది కాంగ్రెస్. దీన్ని ఉద్దేశిస్తూ బీజేపీ గహ్లోత్ ప్రభుత్వంపై విమర్శలకు ఎక్కుపెట్టింది.
Read Also: Heavy Drug Seizure: ఢిల్లీ విమానాశ్రయంలో భారీగా కొకైన్ పట్టివేత
‘రాష్ట్రంలో ఇలాంటి దారుణమైన సంఘటన జరిగింది. 32 మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ బాధితులకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించి, సంఘటనా స్థలానికి వెళ్లకుండా, రాష్ట్ర ప్రభుత్వం సంబరాలు చేసుకుంటూ, అవమానానికి గురిచేస్తోందని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దూషిస్తూ, బిజెపి నాయకుడు రాజేంద్ర సింగ్ రాథోడ్ అన్నారు. అసెంబ్లీ ప్రతిపక్ష ఉపనేత రాథోడ్ జోధ్‌పూర్ చేరుకుని ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రి మార్చురీ వెలుపల నిరసన తెలుపుతున్న కొందరిని కలిశారు. ఆ సంస్థ కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎలాంటి పరిహారం ప్రకటించలేదన్నారు. ప్రతి బాధిత కుటుంబానికి గ్యాస్ కంపెనీ నుంచి రూ. కోటి పరిహారం, రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాథోడ్ స్వయంగా బాధితుల కోసం రూ.11 లక్షలు విరాళంగా ప్రకటించారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2లక్షలు పరిహారం అందించనున్నట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. గాయపడిన వారికి రూ.50 వేలు అందించనున్నట్లు పేర్కొంది.
తాజావార్తలు
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
-
Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
-
Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల ‘ఫ్యాన్స్ మీట్’ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
-
Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?