Rahul Gandhi Dance: రాజస్థాన్‌లో రాహుల్‌తో పాటు కాంగ్రెస్ నేతల డ్యాన్స్ అదుర్స్.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi Dance: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన రాజస్థాన్‌కు చేరుకోగా.. రాష్ట్రంలోని సీనియర్ నేతల మధ్య విభేదాలు కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రానికి చెందిన ముఖ్య నాయకులైన ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి సచిన్ పైలట్ తమ విభేదాలను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఝలావర్‌లో జరిగిన భారత్ జోడో యాత్ర కార్యక్రమంలో ఇద్దరు కాంగ్రెస్ నేతలు వేదికపై రాహుల్ గాంధీతో కలిసి గిరిజన నృత్యంలో పాల్గొనడానికి చేతులు జోడించి నృత్యం చేశారు. ఒకే వేదికపై సీనియర్ నేతలైన రాహుల్ గాంధీ ,అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్, కమల్ నాథ్‌లు స్టెప్పులు వేయడం గమనార్హం. వేదికపై గిరిజన నృత్య బృందం ప్రదర్శించినప్పుడు కాంగ్రెస్ నాయకుడు కమల్ నాథ్ కూడా వేదికపై ఇతరులతో కలిసి వచ్చారు.
Mahakal Temple: ఆలయంలోనే మహిళా భద్రతా సిబ్బంది చిందులు.. వీడియో వైరల్ కావడంతో!
Also Read
- Supreme Court: "ఇస్లాం మతంలోకి మారితే రిజర్వేషన్లు వర్తించవు".. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
- తొలి CNG కారును విడుదల చేసిన మహీంద్రా.. Mahindra XUV 3XO ZNG ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే..
- Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
- US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
గాంధీ రాజస్థాన్ రాకముందు, అశోక్ గెహ్లాట, సచిన్ పైలట్ మద్దతుదారుల మధ్య రాష్ట్రంలో పోస్టర్ యుద్ధం జరిగింది. రాజస్థాన్‌లోని ఝలావర్‌లో మాట్లాడిన గాంధీ వారసుడు కాంగ్రెస్‌ను మహాత్మా గాంధీ పార్టీగా అభివర్ణించారు. “ఇది మహాత్మా గాంధీ పార్టీ, సావర్కర్ లేదా గాడ్సే కాదు. కష్టపడి పనిచేయడం మాకు తెలుసు” అని రాహుల్ గాంధీ అన్నారు. తాను బీజేపీని లేదా ఆర్‌ఎస్‌ఎస్‌ను ద్వేషించనని, అయితే దేశాన్ని “భయంతో బతకనివ్వబోనని” అన్నారు. “ద్రవ్యోల్బణం పెరుగుతోంది, కానీ మొత్తం డబ్బు ముగ్గురు నలుగురు పారిశ్రామికవేత్తలకు వెళుతోంది. ఇది సరైనది కాదు,” అన్నారాయన.
#WATCH | Congress MP Rahul Gandhi, Rajasthan CM Ashok Gehlot & party leaders Sachin Pilot and Kamal Nath take part in a tribal dance in Jhalawar, Rajasthan. pic.twitter.com/18NgWYrWrk
— ANI (@ANI) December 4, 2022
स्वागत, संगीत और सेल्फी।#भारत_जोड़ो_संग_म्हारो_राजस्थान pic.twitter.com/f7g3Ywth9Q
— Congress (@INCIndia) December 4, 2022
తాజావార్తలు
-
Supreme Court: “ఇస్లాం మతంలోకి మారితే రిజర్వేషన్లు వర్తించవు”.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
-
తొలి CNG కారును విడుదల చేసిన మహీంద్రా.. Mahindra XUV 3XO ZNG ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే..
-
Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
-
US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
-
Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసు
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!