Perni Nani Vs GVL: ఇష్టానుసారంగా మాట్లాడితే ఖబడ్దార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో బీజేపీ వర్సెస్ వైసీపీ ఎపిసోడ్ నడుస్తోందా? అంటే అవుననే చెప్పాలి. ఒకవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీలో పర్యటించారు. మాజీ మంత్రి పేర్ని నాని బీజేపీపై చేసిన విమర్శలపై ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఫైరయ్యారు. మాది పువ్వు పార్టీనా.? అడ్డంగా బలిశారంటూ మా నడ్డాను వ్యక్తిగతంగా విమర్శిస్తారా..? మాజీ మంత్రులివి ఒళ్లు బలిసిన మాటలు.
మీదే డబ్బా ఫ్యాన్ పార్టీ.. చెత్త ఫ్యాన్ పార్టీ. డబ్బా ఫ్యాన్ తమ నెత్తి మీద ఎప్పుడు పడుతుందా..? అనే భయంలో ప్రజలు ఉన్నారు. ఇష్టానుసారంగా మాట్లాడితే ఖబడ్దార్ అంటూ ఎంపీ జీవీఎల్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ నేతలు మాట్లాడే ప్రతి చెత్త కామెంటును మా పార్టీ హైకమాండుకు తర్జుమా చేసి పంపుతాం. కేంద్ర నిధులను మళ్లిస్తోంది నిజం కాదా..? అని ఆయన ప్రశ్నించారు.
Also Read
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
కాగ్ తప్పు పట్టిన విధంగా రూ. 12 వేల కోట్లు ఏమయ్యాయి..? అరాచక పాలన సాగిస్తున్న వైసీపీకి ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది. మీకు మీరు డబ్బా కొట్టుకోవడమే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదు. కేంద్రం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఆరోగ్య శ్రీగా మార్చ లేదా..? కేంద్ర పధకాలకు మీ స్టిక్కర్లు వేసుకుంది వాస్తవం కాదా..? కాగ్ నివేదిక చూపిస్తే ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారు..? వీటి సమాధానం చెప్పే దమ్ము మీకుందా? అన్నారు జీవీఎల్.
కేంద్రం ఎంత సాయం చేసింది.. మీరు దేనికి ఎంత వాడారు..? ఆర్ధిక మంత్రి బయటకు వచ్చి చర్చిస్తారా..? ఆర్ధిక మంత్రి ఢిల్లీలో పర్యటిస్తోంది అప్పుల కోసం కాదా..? కొత్తగా తీసుకున్న అప్పుల నుంచి పాత అప్పులు చెల్లిస్తోంది నిజం కాదా..? లక్షల కోట్లు అప్పు చేసి అప్పుల ఏపీగా మార్చారు. వైసీపీ నేతలు మాట్లాడే మాట్లాడే ప్రతి చెత్త మాట మా పెద్దలకు తర్జుమా చేసి మరీ చెబుతాం.
లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియాగా కోట్లు దోచుకుంటున్నారు. డిజిటల్ ఇండియా అంటుంటే.. ఏపీలో లిక్కర్, ఇసుకకు నేరుగా నగదు ఎందుకు తీసుకుంటున్నారు..? స్థాయి తెలుసుకోకుండా, పిచ్చిగా మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. పదవులు పోయాయనే ప్రస్టేషనుతో మాజీ మంత్రులు మాట్లాడుతున్నారు.
ఇంకోసారి రాజకీయ విమర్శలు కాకుండా రంకెలేస్తే తగిన బుద్ధి చెబుతాం. ఏపీలో ఎక్కడికి వెళ్లాలన్నా మమ్మల్ని పోలీసులు అడ్డుకుంటున్నారు. జొన్నాడ వెళితే సోము వీర్రాజుని అడ్డుకున్నారు. ఏపీ ఏమైనా నిషేధిత ప్రాంతమా..?అమలాపురం అల్లర్లను వైసీపీ వాళ్లే చేశారని స్వయంగా మంత్రే చెప్పారు. కేంద్రం సాయం, ఖర్చులు, పధకాల అంశాలపై బహిరంగ చర్చకు సిద్దం.చర్చకు రావాలంటే రండి.. వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకోం అన్నారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు.
తాజావార్తలు
-
Gandhari vs Toxic: ‘గాంధారి’ని చూసి నేర్చుకోవాలి.. ‘టాక్సిక్’ హీరోయిన్స్ పై నెటిజన్స్ కౌంటర్లు ..
-
NBK 111 : ఫ్యామిలీ మెంబర్స్, డాక్టర్స్ మాట బాలయ్య వినడం లేదా?
-
Tuesday Rasi Phalalu: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
Celebrity Marriage: తమ్ముడితో హీరోయిన్గా నటించి.. అన్నను పెళ్లాడిన భామలు వీరే! ఈ లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారంటే?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!