YCP : అక్కడ వైసీపీకి లక్ష ఓట్ల మెజారిటీ వస్తుందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉపఎన్నిక జరుగుతున్న ఆత్మకూరు అసెంబ్లీ సెగ్మెంట్‌లో క్రమంగా పొలిటికల్ హీట్ రాజుకుంటోంది. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2 లక్షల 13 వేల మంది. 2014లో ఇక్కడ వైసీపీకి 33 వేలు, 2019లో 22 వేల ఓట్ల మెజారిటీ వచ్చింది. మేకపాటి గౌతంరెడ్డి అకాల మరణంతో వచ్చిన ఉపఎన్నికలో ఆయన సోదరుడు విక్రంరెడ్డే వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో వచ్చిన మెజారిటీ ఎలా ఉన్నా.. ఉపఎన్నికలో మాత్రం లక్ష ఓట్ల ఆధిక్యం సంపాదించాలనే పట్టుదలతో ఉన్నారు నాయకులు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూశాక కొంత కలవర పడ్డ ఆత్మకూరు వైసీపీ నేతలు.. వెంటనే పార్టీ పెద్దలకు చెప్పారట. ఆ తర్వాతే ప్లాన్ బీ అమలు చేస్తున్నట్టు సమాచారం. దానిచుట్టూనే ప్రస్తుతం చర్చ జరుగుతోంది.
గౌతంరెడ్డిపై ఉన్న సానుభూతితోపాటు సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు లక్ష ఓట్ల మెజారిటీ తీసుకొస్తాయనే అంచనాల్లో ఇన్నాళ్లూ ఉన్నారు వైసీపీ నాయకులు. గ్రౌండ్ రియాలిటీని పరిశీలించాక వ్యూహం మార్చేశారట. నియోజకవర్గంలో ఆరు మండలాలు.. ఆత్మకూరు పట్టణం ఉన్నాయి. ఇక్కడ ఒక్కో మండలానికి ఒక్కో మంత్రిని ఇంఛార్జ్‌గా పెట్టారట. ఆ మంత్రికి సహకరించేందుకు మరో ఎమ్మెల్యేను జత కలిపినట్టు చెబుతున్నారు. ఆయా మండలాలకు చెందిన వైసీపీ నేతలతో మంత్రులు.. ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటున్నారట.
Also Read
ఈ నెల పది నుంచి ప్రచారం స్పీడ్ పెంచాలని గ్రామాల్లో విస్తృతంగా పర్యటించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెప్పారట మంత్రులు. దీనికితోడు ఆత్మకూరు నియోజకవర్గంలోని వైసీపీ నేతల మధ్య ఉన్న విభేదాలు కొంత ఆటంకంగా మారాయట. వాటిని అధిగమిస్తేకానీ.. అనుకున్న లక్ష ఓట్ల ఆధిక్యాన్ని చేరుకోలేమని లోకల్ లీడర్స్‌కు సూటిగా సుత్తిలేకుండా చెబుతున్నారట. గడప గడపకు మన ప్రభుత్వంలో వచ్చిన ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నారట. వాటిని పూర్తి చేసేలా అధికారులను పరుగులు పెట్టించే యోచనలో ఉన్నట్టు సమాచారం. పైగా మండలాల వారీగా బాధ్యతలు చేపట్టిన మంత్రులు.. తమ పరిధిలో ఎక్కువ మెజారిటీ వచ్చేలా చూడాలని వైసీపీ అధిష్ఠానం ఆదేశించినట్టు తెలుస్తోంది.
లక్ష ఓట్ల మెజారిటీ సాధించాలంటే.. పోలింగ్ శాతాన్ని గణనీయంగా పెంచాలని స్థానిక ఎన్నికల ఇంఛార్జ్‌లకు పార్టీ నేతలు దిశానిర్దేశం చేశారట. అసంతృప్తి నేతలను బుజ్జగించి.. వారు ఫీల్డ్‌లో పనిచేసేలా ప్రయత్నాలు మొదలయ్యాయట. ఈ విషయంలో మంత్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆత్మకూరులో వైసీపీ నేతల నోట లక్ష ఓట్ల ఆధిక్యం తప్ప మరో మాట వినిపించడం లేదు. మరి.. పోలింగ్ నాటికి లక్ష్య సాధనలో ఆత్మకూరు వైసీపీ నేతలు ఏం చేస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!