నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు మేకపాటి విక్రమ్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రి మేకపాటి గౌతం రెడ్డి హఠాన్మరణంతో ఆత్మకూరు అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా మేకపాటి గౌతమ్ రెడ్డిని ఎంపిక చేశారు సీఎం జగన్. బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు…
మహానాడు ముగిసినప్పటి నుంచీ కొనసాగుతూ వస్తోన్న నటి దివ్యవాణి రాజీనామా వ్యవహారానికి ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పడింది. తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నానని ఆమె తన తుది నిర్ణయాన్ని ప్రకటించారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో భేటీ అయిన అనంతరం.. తాను తెలుగుదేశానికి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్టు దివ్యవాణి స్పష్టం చేశారు. నిజానికి.. దివ్యవాణి రాజీనామా వ్యవహారం సినిమాటిక్గా సాగిందని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. మహానాడు ముగిసిన వెంటనే దివ్యవాణి ట్విటర్ మాధ్యమంగా టీడీపీకి రాజీనామా చేస్తున్నానని…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రోజురోజుకి ఎలా వేడెక్కుతున్నాయో అందరూ చూస్తూనే ఉన్నారు. అధికార, ప్రతిపక్ష నేతలు ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఇప్పుడు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, ఎంపీ విజయసాయి రెడ్డి మధ్య ట్విటర్ వార్ మొదలైంది. తొలుత తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అయ్యన్నపాత్రుడు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దుర్మార్గ, రాక్షస పరిపాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని తాను దేవుణ్ణి ప్రార్థించానన్నారు. తమని రక్షించడంతో పాటు ‘నిన్ను నువ్వు కూడా…
ఏపీలో కోనసీమ అల్లర్లు హాట్ టాపిక్ అవుతోంది. అల్లర్లు జరిగి వారం అవుతున్నా ఇంకా అక్కడ అలజడి చల్లారలేదు. అంబేద్కర్ పేరుని చాలా చోట్ల పెట్టినా.. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెడితే ఎందుకు గొడవలు జరిగాయి..? బీజేపీ 42 చోట్ల అంబేద్కర్ పేరు పెట్టినా గొడవలు రాలేదు.. కోనసీమలో ఎందుకు గొడవలు జరిగాయి..? అని ప్రశ్నించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. కేవలం ఓట్ల కోసం చేస్తున్న రాజకీయంలో భాగంగానే కోనసీమలో గొడవలు జరిగాయి.కొన్ని…
కాకినాడ జిల్లాలోని పిఠాపురం వైసీపీలో కొత్త సెగలు రేగుతున్నాయి. ఎంపీ వంగాగీత, ఎమ్మెల్యే పెండెం దొరబాబు మధ్య రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఇద్దరూ పిఠాపురం కేంద్రంగా పొలిటికల్ ఎత్తుగడలు వేస్తున్నారు. రోజులు గడిచేకొద్దీ అవి కాకరేపుతున్నాయి. ఎంపీ, ఎమ్మెల్యేలు వేసే ఎత్తుగడలు.. రాజకీయ వ్యూహాలు ఆసక్తిగా మారుతున్నాయి. వంగా గీత కాకినాడ వైసీపీ ఎంపీగా ఉన్నారు. అంతకుముందు టీడీపీ తరఫున జడ్పీ ఛైర్పర్సన్గా.. రాజ్యసభ సభ్యురాలిగా పని చేశారు. వంగా గీత సొంత నియోజకవర్గం పిఠాపురం. కాకినాడ…
బీహార్లోని పశువుల దాణా కుంభకోణం తరహాలోనే ఏపీ ప్రభుత్వం మూగజీవాల పేరుతో భారీ దోపిడీకి పాల్పడుతోందని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ నరేంద్ర వ్యాఖ్యనించారు. ఆర్బీకేల ద్వారా వల్లభ ఫీడుని అమ్ముడుతున్నారని, అది ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిది కాదా? అని ప్రశ్నించారు. ఫెర్టయిల్ గ్రీన్ అనే కంపెనీ ద్వారా పశువుల మేత కోసం వినియోగించే టీఎంఆర్ను మెట్రిక్ టన్ను రూ. 16 వేలకు కొనుగోలు చేస్తున్నారన్నారు. వెటర్నరీ డాక్టర్లకు టార్గెట్ పెట్టి మరీ.. ఆ కంపెనీ సరఫరా…
ఉమ్మడి కర్నూలు జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు మొదలు.. మొన్నటి పంచాయతీ ఎన్నికల వరకు అధికారపార్టీ వైసీపీ విజయఢంకా మోగించింది. రెండు ఎంపీ స్థానాలు.. 14 అసెంబ్లీ, 8 మున్సిపాలిటీలు.. 53 జడ్పీటీసీ, 53 ఎంపీపీ అన్నీ వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. ఇవి కాకుండా ముగ్గురు ఎమ్మెల్సీలు.. మరెన్నో కార్పొరేషన్ల ఛైర్మన్లు.. డైరెక్టర్లు ఎందరో ఉన్నారు. కర్నూలు నగరంలో బలమైన వైసీపీ నేతలకు కొదవ లేదు. ఇంతమంది ఉన్నప్పటికీ సామాజిక న్యాయభేరి పేరిట చేపట్టిన బస్సుయాత్రను లైట్ తీసుకున్నారు.…
గతంలో నేతలు పాదయాత్రలు చేస్తే.. వారి తనయులు వారిలాగే పాదయాత్రలకు పూనుకున్నారు. ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వైసీపీ అధినేత, వైఎస్ తనయుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారు. 2019లో ఆయన అధికారం హస్తగతం చేసుకున్నారు. రెండుసార్లు తండ్రితనయులు పాదయాత్రల ద్వారా అత్యున్నత పీఠం అధిరోహించారు. అదే రీతిలో చంద్రబాబు కూడా పాదయాత్ర చేసి అధికారం పొందారు. చంద్రబాబు బాటలోనే ఆయన…