జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాను బరిలో నిలిచిన పిఠాపురం నియోజకవర్గం నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. మార్చి 30 నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకు పవన్ తొలి విడత ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
బీజేపీ కేంద్ర అధిష్ఠానం నిర్ణయం మేరకే టికెట్ల కేటాయింపు జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. రాజమండ్రిలో ఆమె టికెట్ల కేటాయింపుపై వ్యాఖ్యలు చేశారు. అధిష్ఠానం నిర్ణయాన్ని బీజేపీ కార్యకర్తలు అంతా గౌరవిస్తున్నారన్నారు.
రాజ్యాంగం వల్ల ఓటు ద్వారా ఎన్నికై చట్ట సభల్లో అడుగు పెడుతున్నారని.. దురదృష్టవశాత్తు యాభై సంవత్సరాల పాటు సుప్రీంకోర్టులో చట్టం ద్వారా ఓటు ప్రక్రియ వచ్చినట్లు తీర్పులు వచ్చాయని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేయకపోవడం వల్ల ఈ వ్యాఖ్యానాలు వచ్చాయన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రను మొదలుపెట్టారు. ఇప్పటివరకు మూడు నియోజకవర్గాలలో బస్సు యాత్ర ముగిసింది. తొలిరోజు వైఎస్సార్ జిల్లా కడప పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో యాత్ర కొనసాగించింది.
ఏప్రిల్, మే నెలలకు పెన్షన్ పంపిణీపై గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈఓ సర్క్యులర్ జారీ చేశారు. పెన్షన్ పంపిణీకి సంబంధించి వాలంటీర్లు ఆథరైజేషన్ పత్రాలు తీసుకోవాలని సర్క్యులర్ జారీ చేయడం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర ప్రారంభమైంది. ఇడుపులపాయ నుంచి ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తాడేపల్లి నుంచి ఇడుపులపాయకు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్... తన తండ్రి సమాధి వైఎస్ ఘాట్ వద్ద సర్వమత ప్రార్థనలను నిర్వహించారు.
ఏపీలో ఎన్నికల వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. సీటురాని అసంతృప్త నేతలు పార్టీలు మారుతున్నారు. వైసీపీలోకి జనసేన ముమ్మిడివరం కోఆర్డినేటర్ పితాని బాలకృష్ణ చేరే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలో ఏ చెట్టును అడిగినా.. పుట్టను అడిగినా సైకిల్ మాటే వినపడుతోందని.. కూటమి గెలుపు మాటే వినపడుతోందని చంద్రబాబు చెప్పుకుచ్చారు. కుప్పంలో చంద్రబాబు పర్యటిస్తున్నారు.
నెల్లూరు లోక్సభ వైసీపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో పలువురు జన సేన నేతలు, కార్యకర్తలు వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టసభల్లో ఎక్కడా జనసేన పార్టీకి ప్రాతినిధ్యం లేదన్నారు. కేవలం చట్ట సభల్లోకి రావడానికే టీడీపీ, బీజేపీలతో పొత్తు పెట్టుకున్నారని ఆయన విమర్శలు గుప్పించారు.