Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఖరారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాను బరిలో నిలిచిన పిఠాపురం నియోజకవర్గం నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. మార్చి 30 నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకు పవన్ తొలి విడత ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. తొలి విడత పర్యటనలో భాగంగా మొత్తం 12 రోజులపాటు 10 నియోజకవర్గాల్లో పర్యటించాలని పార్టీ ప్రణాళిక ఖరారు చేసింది. తొలి విడతలో ఐదు రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గం పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. ఈ నెల 30 నుంచి వచ్చే నెల రెండో తేదీ వరకు పిఠాపురంలో పర్యటించనున్నారు జనసేనాని పవన్ కల్యాణ్. మళ్లీ వచ్చే నెల 9వ తేదీన పవన్ పిఠాపురానికి రానున్నారు.
Read Also: K.Keshava Rao : నేను 55 ఏళ్ళు కాంగ్రెస్‌లో ఉన్నా.. నన్ను cwc మెంబర్‌గా చేసింది కాంగ్రెస్
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
పిఠాపురంలో శక్తి పీఠం పురూహూతిక అమ్మవారిని దర్శించుకుని, వారాహి వాహనానికి పవన్ పూజలు చేయించనున్నారు. ఆ తర్వాత దత్తపీఠాన్ని సందర్శించనున్నారు. తొలి విడత ప్రచారంలో ఐదు రోజు అక్కడే బహిరంగసభల్లో పాల్గొంటారు. స్థానికంగా వివిధ వర్గాల వారితో సమావేశమవుతారు. పార్టీ క్యాడర్‌తోనూ సమావేశమై ఎన్నికల ప్రచారం తదితర అంశాలపై దిశా నిర్దేశం చేస్తారు. ఆ తర్వాత ఉమ్మడి గుంటూరు జిల్లాలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తున్న తెనాలి నియోజకవర్గంలో ఏప్రిల్ 3న పవన్ ప్రచారం చేయనున్నారు. మనోహర్‌తో కలిపి సభలో పాల్గొననున్నారు.
పవన్ కల్యాణ్ తొలి విడత ప్రచార షెడ్యూల్ ఇదే..
ఏప్రిల్ 3 – తెనాలి
ఏప్రిల్ 4 – నెల్లిమర్ల
ఏప్రిల్ 5 – అనకాపల్లి
ఏప్రిల్ 6 – యలమంచిలి
ఏప్రిల్ 7 – పెందుర్తి
ఏప్రిల్ 8 – కాకినాడ రూరల్
ఏప్రిల్ 10 – రాజోలు
ఏప్రిల్ 11 – పి.గన్నవరం
ఏప్రిల్ 12 – రాజానగరం.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!