Pithani Balakrishna: ఏపీలో ఎన్నికల వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. సీటురాని అసంతృప్త నేతలు పార్టీలు మారుతున్నారు. వైసీపీలోకి జనసేన ముమ్మిడివరం కోఆర్డినేటర్ పితాని బాలకృష్ణ చేరే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో జనసేన తరపున ముమ్మిడివరం నుంచి పితాన బాలకృష్ణ పోటీ చేశారు.
Read Also: Volunteers Resignation: రాజమండ్రిలో వాలంటీర్ల సామూహిక రాజీనామాలు..
2019 సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీలో టికెట్ రాకపోవడంతో జనసేనలోకి బాలకృష్ణ వచ్చారు. 2019లో జనసేన మొదటి అభ్యర్థిగా బాలకృష్ణను పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. నిన్న పార్టీపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు పితాని బాలకృష్ణ. శెట్టిబలిజలకు ఒకరికి కూడా సీటు ఇవ్వలేదని పార్టీని ప్రశ్నించారు. వన్ కళ్యాణ్ కనీసం కలవడానికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ముమ్మిడివరం పొత్తులో టీడీపీకి వెళ్తే రామచంద్రపురం సీటుపై ఆశలు పెట్టుకున్నారు పితాని బాలకృష్ణ. అక్కడ తనకు టికెట్ దక్కకపోవడంతో పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరీ ఆయన అధికారికంగా ప్రకటించేవరకు వేచి చూడాల్సిందే.