ఏపీలో వైసీపీకి మరో షాక్ తగిలింది. ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా ఆదివారం వైసీపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎలీజాను పార్టీలోకి ఆహ్వానించారు.
రాజకీయ హింసాత్మక ఘటనలపై మూడు జిల్లాల ఎస్పీలను వివరణ కోరానని ఏపీ సీఈఓ ఎంకే మీనా పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో జరిగిన హత్య రాజకీయ హింసేనని జిల్లా ఎస్పీ చెప్పారన్నారు.
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు, ప్రతివిమర్శలకు దిగుతున్నారు. ఇటీవల తనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కాకినాడ ఎంపీ, వైఎస్సార్‌సీపీ పిఠాపురం అభ్యర్థి వంగా గీత కౌంటర్ ఇచ్చారు. బుధవారం ఉదయం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె.. ఎన్టీవీతో మాట్లాడారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం వైసీపీ ఇన్‌ఛార్జ్ బుట్టా రేణుకపై తీవ్రంగా మండిపడ్డారు టీడీపీ నేత మాచాని సోమనాథ్. మాచాని సోమప్ప ఎక్కడైతే అభివృద్ధిని వదిలేసారో.. వాటన్నిటిని ముందుకు తీసుకెళ్తానని, చేనేత అభివృద్ధికి పాటుపడుతానని ఇటీవల చేనేత ఆత్మీయ సమ్మేళన సభలో బుట్టా రేణుక చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు.
టీడీపీ ఇటీవల 94 మందితో అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవాళ చంద్రబాబు మాట్లాడుతూ, వీలైనంత మంది టీడీపీ అభ్యర్థులతో రెండో జాబితాను రేపు ప్రకటిస్తామని వెల్లడించారు. టీడీపీ అభ్యర్థుల జాబితా కసరత్తులు తుది దశకు చేరుకున్నాయని ఆయన వెల్లడించారు.
ఏపీ రాజధానిపై సీఎం జగన్ సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల తర్వాత ఏపీ రాజధానిగా విశాఖ ఉంటుందని అన్నారు. ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఇక్కడే సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తానని.. ఎన్నికల తర్వాత విశాఖలోనే ఉంటామన్నారు.
పాతికేళ్ల కాలం నుంచి రాజమండ్రి బాగా తెలుసని.. గడిచిన ఐదేళ్లలో రాజమండ్రి డెవలప్మెంట్ కనిపిస్తుందని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఒక ప్రజా ప్రతినిధి చిత్తశుద్ధితో తన ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తే ఎలా ఉంటుందో మార్గాని భరత్‌ను చూస్తే అర్థమవుతుందన్నారు.
రేపు(మంగళవారం) సీఎం వైఎస్ జగన్మోహన్ విశాఖలో పర్యటించనున్నారు. పారిశ్రామిక, వ్యాపార వేత్తల సదస్సుకు సీఎం జగన్ హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్ డెవలప్‌మెంట్ పేరుతో కీలక ఉపన్యాసం ఇవ్వనున్నారు ముఖ్యమంత్రి జగన్. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు జగన్.. అనంతరం భవిత పేరుతో కొత్త కార్యక్రమం ప్రారంభించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన టెట్, టీఆర్టీ(టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్) నోటిఫికేషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పరీక్షల షెడ్యూల్ మార్చాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఈ రెండు పరీక్షల మధ్య 4 వారాల సమయం ఉండాలని పేర్కొంది.
ఏపీలో బీజేపీ రెండు రోజుల కీలక సమావేశాలు ముగిశాయి. పార్టీ ముఖ్య నేతలు, జిల్లాల్లోని కీలక నేతలతో జాతీయ సహ సంఘటనా కార్యదర్శి శివ ప్రకాష్ వరుస సమావేశాలు నిర్వహించారు.