CM Chandrababu: ప్రజల కోణంలో ఆలోచించేలా అధికారులు వ్యవహరించాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.. సచివాలయంలోని ఆర్టీజీ సెంటర్ నుంచి వివిధ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. క్షేత్ర స్థాయిలో అందుతున్న సేవలు ఏ విధంగా అందుతున్నాయనే అంశంపై ఆరా తీశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ… “ప్రజలకు సంతృప్తికరంగా సేవలందించాలి. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి. ప్రభుత్వం అమలు…
Speaker Ayyanna Patrudu: ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తన రాజకీయ జీవితం, స్పీకర్ బాధ్యతలు, సైబర్ నేరాలు, యువత పాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కృష్ణాజిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. స్పీకర్ కావడానికి ముందు తాను ఎక్కువగా మాట్లాడేవాడినని, స్పీకర్ అయిన తర్వాత మాత్రం నోటికి ప్లాస్టర్ వేసినట్టయ్యిందని వ్యాఖ్యానించారు. సభలో కూర్చుని ఆదేశాలు ఇవ్వడం తప్ప గత రెండేళ్లుగా మాట్లాడే అవకాశం లేదని అన్నారు. స్పీకర్ పదవి చాలా…
జనసేన పార్టీ స్థాపించిందే ప్రశ్నించడానికి అని చెప్పిన పవన్ కళ్యాణ్.. డిప్యూటీ సీఎం అయ్యాక కూడా ప్రశ్నించకుండా ముసిముసి నవ్వులు నవ్వుతున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శించారు. గ్రామాల్లోకి వెళ్ళి చూడండని.. కూల్ డ్రింక్స్ ఎలా దొరుకుతాయో మందు అలానే దొరుకుతుందని ఎద్దేవా చేశారు. ఇంత మద్యం అమ్మిన మూడు శాతమే ఆదాయం ఎందుకు పెరిగిందని.. పది శాతం పెరగాల్సిన ఆదాయం మూడు శాతం ఎలా ఉంది.. ఎవరి చేతిలోకి ఆదాయం వెళ్తుందని…
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన ప్రక్రియ వేగవంతమైంది. ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు.
Sri SathyaSai Dist: శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిలో ఈరోజు సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన ప్రత్యేక పుష్పాలతో సత్యసాయి మహా సమాధిని భక్తులు అలంకరించారు.
భూముల వేలంలో రికార్డు.. రాయదుర్గంలో గజం ధర రూ.3.40 లక్షలు తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) నిర్వహించిన వేలంలో భూముల ధరలు రికార్డు సృష్టించాయి. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీకి నడిబొడ్డున ఉన్న రాయదుర్గం ప్రాంతంలో ఒక ఎకరం భూమికి చదరపు గజానికి రూ.3,40,000 ల చొప్పున గణనీయమైన ధర పలికింది. చదరపు గజానికి ₹3,40,000 ల చారిత్రాత్మక ధరతో ఈ వేలం మునుపటి రికార్డును బద్దలు కొట్టింది. గతంలో, 2017లో చదరపు గజానికి రూ.88,000…
ఏపీ వ్యాప్తంగా ఏసీబీ అధికారుల బృందాలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మెరుపు దాడులు నిర్వహిస్తున్నాయి. విజయవాడ ఇబ్రహీంపట్నం, పలనాడు జిల్లా నరసరావుపేట, తిరుపతి రేణిగుంట, విజయనగరం భోగాపురం, విశాఖ మధురవాడ, ఒంగోలు, కర్నూలు కడప వంటి అన్ని ప్రాంతాల్లో ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయాలు అధికారులు మెరుపు దాడులు చేస్తున్నారు. సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ప్రైవేటు వ్యక్తులు పనిచేయడంతో పాటు ఏజెంట్లు సబ్ రిజిస్టర్ కార్యాలయ సిబ్బంది కొమ్మక్కై అవినీతికి పాల్పడుతున్నారని అంశాల మీద విచారణ చేస్తున్నారు.…
YS Jagan: వైసీపీ నేత, మాజీమంత్రి జోగి రమేష్ అరెస్ట్ పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రంగా మండిపడ్డారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే జోగి రమేష్ ను అరెస్ట్ చేశారంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు.
ఏపీలో పేకాటరాయుళ్లు రెచ్చిపోతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల ఇష్టారాజ్యం సాగుతోంది. వీరికి పోలీసుల మద్దతు తోడవుతోంది. ఇంకేముంది.. మూడు ముక్కలు.. ఆరు ఆటలు అన్నట్టుగా సాగుతోంది యవ్వారం. ఓవైపు తెలంగాణలో పేకాట క్లబ్బుల్ని ఉక్కుపాదంతో అణచివేస్తే.. ఏపీలో మాత్రం పేకాటను పెంచి పోషించి.. త్వరలో రిక్రియేషన్ క్లబ్బుల స్థాయికి తీసుకెళ్లే యజ్ఞం శ్రద్ధగా సాగుతోంది. పైగా కొందరు నేతలు మా ప్రాంతంలో పేకాట కామన్ అంటూ కామెంట్లు చేయడం.. చతుర్ముఖ పారాయణానికి మరింత కిక్ ఇస్తోంది. ఏపీలో…