ఆంధ్రప్రదేశ్లో మూడు జిల్లాలకు కలెక్టర్లు, ఐదు జిల్లాలకు ఎస్పీల నియామకం జరిగింది. ఇటీవల కొందరు జిల్లా ఎస్పీలు, కలెక్టర్లపై ఎన్నికల కమిషన్ బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. ముగ్గురు ఐఏఎస్లతోపాటు, 6గురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది.
ఏపీలో సీఎం జగన్ చేపట్టిన 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర ఐదో రోజు దిగ్వజయంగా కొనసాగింది. ఈ యాత్రలో భాగంగా సీఎం యాత్ర కదిరికి చేరింది. ఈ నేపథ్యంలోనే రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరుల కోసం కదిరిలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ సీనియర్ నేతగా ఉన్న నిమ్మక జయకృష్ణ పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.
ఈ 40 రోజులు చాలా కీలకమని.. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా పనిచేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు సూచించారు. ఎన్డీఏ కార్యకర్తల సమావేశంలో పవన్ కల్యాణ్ దిశానిర్ధేశం చేశారు. వైసీపీ కుట్రలు, కుతంత్రాలు సమర్థవంతంగా ఎదుర్కోవాలని సూచనలు చేశారు.
తప్పు చేసిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేవాడిని చిత్తూరు ఎమ్మెల్యేగా పెట్టారని.. రాష్ట్రాన్ని స్మగ్లింగ్కు అడ్డాగా మార్చారని విమర్శలు గుప్పించారు.
ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. అన్ని పార్టీల నేతలు తమ ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం పేరుతో ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేట ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగించారు.సూళ్లూరుపేటలో టీడీపీ గాలి వీస్తోందన్న ఆయన.. జగన్కు ఓటు వేసినందుకు ఆయన ప్రజలను మోసగించారని విమర్శించారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర నాలుగో రోజు కొనసాగుతోంది. ఈ రోజు కర్నూలు జిల్లా రాతన నుంచి మొదలైన సీఎం జగన్ బస్సు యాత్ర నేటి రాత్రికి అనంతపురం జిల్లాలోకి ప్రవేశించనుంది. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా తుగ్గలి ప్రజలతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు.