CM Jagan Election Campaign: ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Jagan Election Compaign: ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభమైంది. ఇడుపులపాయ నుంచి ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తాడేపల్లి నుంచి ఇడుపులపాయకు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్… తన తండ్రి సమాధి వైఎస్ ఘాట్ వద్ద సర్వమత ప్రార్థనలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగన్ తల్లి విజయమ్మ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్‌కు విజయమ్మ ముద్దు పెట్టి, ఆశీర్వదించి యాత్రకు సాగనంపారు. యాత్ర కోసం సిద్ధంగా ఉన్న బస్సులోకి జగన్, వైఎస్ అవినాష్ రెడ్డి, జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి, కడప జిల్లా నేతలు ఎక్కారు. అనంతరం బస్సు యాత్ర ప్రారంభమయింది. ఇడుపులపాయ, వేంపల్లి, వీరపునాయునపల్లి, యర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరుకు బస్సు యాత్ర చేరనుంది.
Read Also: Kodali Nani: చంద్రబాబుపై కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు
Also Read
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 21 రోజుల పాటు ఈ బస్సు యాత్ర కొనసాగనుంది. ఈరోజు కడప జిల్లాలో బస్సుయాత్ర కొనసాగుతుంది. సాయంత్రం నాలుగు గంటలకు ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డు సమీపంలో నిర్వహించే బహిరంగసభలో జగన్ ప్రసంగిస్తారు. రాత్రికి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు సీఎం చేరుకుంటారు. ఆళ్లగడ్డలో ఏర్పాటు చేసిన శిబిరంలో రాత్రికి ముఖ్యమంత్రి జగన్ బస చేస్తారు.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!