Proddatur: ప్రొద్దుటూరుకు చేరుకున్న ‘మేమంతా సిద్ధం’ యాత్ర.. మారుమోగుతున్న సభాప్రాంగణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Proddatur: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రను మొదలుపెట్టారు. ఇప్పటివరకు మూడు నియోజకవర్గాలలో బస్సు యాత్ర ముగిసింది. తొలిరోజు వైఎస్సార్ జిల్లా కడప పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో యాత్ర కొనసాగించింది. ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద మహానేతకు నివాళులర్పించి, ప్రత్యేక ప్రార్థనలు అభిమానుల కోలాహలం నడుమ మొదలైన యాత్ర.. సాయంత్రం వీరపనాయునిపల్లి మండలంలో ముగిసింది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో దాదాపు 45 కిలోమీటర్లు బస్సుయాత్ర పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే.. దారి పొడవునా గ్రామాల్లో జనం జననేతకు నీరాజనం పట్టారు. మధ్య మధ్యలో సీఎం జగన్ వాహనం పైకి ఎక్కడి అభివాదం చేశారు. అంతేకాదు.. ప్రజలు సమర్పించిన విజ్ఞప్తి పత్రాలను సీఎం స్వీకరించారు.
Read Also: Chandrababu: ఆట మొదలైంది.. ఎన్డీఏ గెలుపును ఎవరూ ఆపలేరు..
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
సీఎం జగన్‌ను చూసేందుకు ప్రజలు అశేషంగా కదలివచ్చారు. బస్సు యాత్రకు ఘనస్వాగతం పలికేందుకు మారుమూల గ్రామాల నుంచి ప్రధాన రహదారికి పల్లె ప్రజలు తరలివచ్చారు. జగన్‌ను చూసేందుకు సుదీర్ఘ నిరీక్షణ.. టెంట్లు వేసుకుని, భోజనాలు ఏర్పాటు చేసుకుంటూ దారిపొడవునా సీఎం జగన్ కోసం నిరీక్షించారు. రోడ్‌షోలో జగన్‌ను చూసిన వెంటనే హర్షధ్యానాలు, కేరింతలతో జనం స్వాగతం పలికారు. అడుగడుగునా పూలతో సీఎం జగన్‌కు ఆత్మీయ స్వాగతం పలికారు. వెల్లువెత్తిన జనంతో అనుకున్న సమయం కన్నా బస్సుయాత్ర ఆలస్యంగా నడుస్తోంది. కాసేపట్లో ప్రొద్దుటూర్ టౌన్‌లో జరగబోయే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించనున్నారు. బహిరంగ సభ కోసం జనం తండోపతండాలుగా తరలివచ్చారు. సీఎం జగన్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!