బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాను ప్రభావం వల్ల ఆంధ్ర రాష్ట్రంలోని తీరప్రాంతం అలజడిగా మారింది. ఈ నేపథ్యంలోనే తుఫాను కారణంగా సముద్రం ఒడ్డుకు బంగారు వర్ణం కలిగిన ఓ రథం తీరానికి కొట్టుకొచ్చింది. సంతబొమ్మాళి సున్నాపల్లి సముద్రం రేవుకు ఇది కొట్టుకురావడం వల్ల.. దీన్ని వీక్షించేందుకు స్థానిక ప్రజలు ఎగబడ్డారు. ఇలాంటిది ఆ ప్రాంతంలో మునుపెన్నడూ చూడలేదని వాళ్ళు చెప్తున్నారు. బంగారు వర్ణంతో తళతళమని మెరిసిపోతున్న ఈ రథంపై 16-1-2022 అని విదేశీ భాషలో రాసి ఉంది.…
అసని తుఫాన్ మీద సీఎం జగన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సహాయక చర్యలపై సమీక్ష జరిపిన ఆయన.. తుపాను నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. తుపాను నేపథ్యంలో అలెర్ట్గా ఉండాలని.. తుఫాను తీరం వెంబడి ప్రయాణిస్తోంది కాబట్టి తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారుల్ని సూచించారు. తుఫాను బలహీనపడటం ఊరటనిచ్చే అంశమని చెప్పిన సీఎం జగన్.. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.…
గ్రామాల్లో చిన్న చిన్న గొడవలు చినికి చినికి గాలివానగా మారుతున్నాయి. దీంతో అక్కడ రెండువర్గాలుగా విడిపోవడంతో దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జి కొత్తపల్లి లో దారుణ హత్య జరిగింది. దీంతో అక్కడ కలకలం రేగింది. వైసీపీ గ్రామ ప్రెసిడెంట్ గంజి ప్రసాద్ ను నరికి చంపారు కొంతమంది దుండగులు. దీంతో ఊరు చివర పడి ఉంది ప్రసాద్ మృత దేహం. సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపడుతున్నారు పోలీసులు. గ్రామ సర్పంచ్…
1.ఏపీలో జిల్లాల స్వరూపం మారిపోతోంది. మరికొద్ది గంటల్లో కొత్త జిల్లాలకు శ్రీకారం చుట్టనున్నారు సీఎం జగన్. కొత్త జిల్లాలకు సంబంధించిన వివరాలను ఎన్టీవీతో ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ పంచుకున్నారు. మంటేడ మండలాన్ని పార్వతీపురం నుంచి విజయనగరం జిల్లాలోకి మార్చాం. పెందుర్తి నియోజకవర్గంలోని పెందుర్తి మండలాన్ని విశాఖలో ఉంచాం అన్నారు. https://ntvtelugu.com/andhrapradesh-new-districts-muhurtam-on-4april-2022/ 2.ఈరోజు ఉదయం నుంచి హైదరాబాద్ లోని ఓ పబ్ పై పోలీసులు దాడి జరిపారు. అందులో పలువురు ప్రముఖుల పిల్లలు పట్టుబడ్డారు అనే…
శ్రీ ఫ్లవ నామ సంవత్సరం మరికొద్ది గంటల్లో ముగుస్తుంది. శుభకృత్ నామ సంవత్సరం రాబోతోంది. శ్రీ ఫ్లవనామ సంవత్సరం చివరిరోజు ఈ స్తోత్ర పారాయణం చేస్తే సకల శుభాలు కలుగుతాయి.
తెలుగు రాష్ట్రాల్లో రాహు కేతు పూజలు, గ్రహణాల సమయంలోనూ తెరిచి వుండే శ్రీకాళహస్తీశ్వరుని ఆలయానికి రోజూ వేలాదిమంది భక్తులు వస్తుంటారు. ఆలయంలో అవకతవకలు జరగడంతో ఈవో పెద్దిరాజు తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. ఆలయములో ఇద్దరు ఉద్యోగుల్ని సస్పెండ్ చేయగా, మరో ఇద్దరికి ఛార్జి మెమోలు జారీ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలమేరకు ఉత్తర్వులు జారీ చేశారు ఆలయ ఈఓ పెద్దిరాజు. రాహు కేతు పూజలకు సరైన సమయానికి నాగ పడగలు…
కాసేపట్లో ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ 2022-23 ప్రవేశపెట్టనున్నారు ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఉదయం సమావేశం అయిన ఏపీ కేబినెట్ బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేపింది. ఈ సందర్భంగా సోషియో ఎకనమిక్ సర్వే విడుదలయింది. ప్రణాళిక సంఘం కార్యదర్శి విజయ్ కుమార్ సోషియో ఎకనమిక్ సర్వే విడుదల చేశారు. దీని ప్రకారం జీఎస్డీపీ రూ. 12.01 కోట్లుగా ఉంది. ఏపీలో యాన్యువల్ గ్రోత్ రేట్ 18.47 శాతంగా ఉంది.కరోనా కారణంగా ఎలాంటి ప్రగతి లేదు.. ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది.…
2021 నవంబర్లో భారీ వర్షాలు, వరదల వల్ల పంట నష్ట పోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో వరదలతో నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీని నేడు సీఎం జగన్ లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశారు. జగన్ బటన్నొక్కి నేరుగా 5.17 లక్షల మంది లబ్దిదారుల ఖాతాల్లో రూ.534.77 కోట్లను జమ చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. 1,220 రైతు గ్రూపులకు వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద…
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది టీటీడీ. త్వరలో తిరుమల దర్శన టికెట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది. కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి తెలిపారు. దేశంలో స్వల్పంగా గడిచిన 24 గంటల్లో 67,084 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, 1,241 మరణాలు నమోదు కాగా ప్రస్తుతం దేశంలో 7,90,789 యాక్టివ్ కరోనా కేసులు వున్నాయి. కరోనా ఎఫెక్ట్ తగ్గడంతో ఈ నెల 16వ తేదీ నుంచి తిరుపతిలో…
ఏపీలో ఇప్పటికే ఉద్యోగుల పీఆర్సీ అంశంతో జగన్ సర్కార్ సతమతమవుతుంటే ఏపీ వైద్యాఆరోగ్య శాఖ ఉద్యోగులు మరో బాంబ్ పేల్చారు. జగన్ సర్కార్కు ఊహించని షాక్ ఇచ్చారు. సాధారణ ఉద్యోగులతో పాటు తామూ సమ్మెకు వెళ్తామని వైద్యారోగ్య సిబ్బంది తెలిపింది. పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు దశల వారి ఉద్యమానికి ఏపీ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ అసోసియేషన్ ( హంస) సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని పేర్కొన్నారు. ఏపీ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్( ఏపీ…