నగరంలో రోజు రోజుకూ మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో మహిళ రక్షణ ప్రశ్నార్థకంగా మారుతోంది. పటిష్ట నిఘా ఉన్నా.. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు పెట్టిన.. పోలీస్ యంత్రాంగా 24 గంటలు అలర్ట్ గా ఉన్నా.. కామాంధులు రెచ్చిపోతున్నారు. ఈ మధ్య కాలంలో అత్యాచారాలు, హత్యలు.. లైంగిక వేధింపుల ఘటనలు పెరుగుతున్నాయి.
గుడిలోనూ, బడిలోనూ, ఆస్పత్రుల్లోనూ మహిళలకు రక్షణ లేకుండో పోతోంది. మైనర్ నుంచి ముసలి వయసు వరకు.. మహిళ అంటే చాలు కిరాతకులు రెచ్చిపోతున్నారు. కామవాంఛలతో మానభంగాలకు పాల్పడుతున్నారు. తరచూ ఇలాంటి వార్తలు వినాల్సి వస్తోంది. తాజాగా జరిగిన ఓ ఘటన తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఓ మహిళను కాళ్లు, చేతులు కట్టి, నోట్లో బట్ట కుక్కి మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డారు కామాంధులు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది.
ఇక వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం మహంతంలో దారుణం చోటుచేసుకుంది. కాళ్ళు చేతులు కట్టి, నోట్లో బట్టని కుక్కి మహిళపై ముగ్గురు వ్యక్తుల అత్యాచార యత్నం చేశారు దుండగులు. మహిళ తేరుకుని డయల్ 100కు కాల్ చేయడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళను కాపాడారు. కేసు నమోదు చేసుకుని ఘటన పై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
కాగా.. 28 ఏప్రిల్ 2022 నిజామాబాద్ జిల్లాలో బాలికపై అఘాయిత్యం జరిగింది. మతిస్థిమితంలేని బాలికపై పెదనాన్న, ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ అత్యాచారానికి పాల్పడ్డారు. తల్లిదండ్రులు చనిపోవడంతో పెదనాన్న ఇంట్లో బాలిక ఉంటుంది. బాలికపై పలుమార్లు పెదనాన్న, ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు వాపోతుంది. ప్రస్తుతం ఆ బాలిక 8 నెలల గర్భవతిగా ఉంది. జరిగిన ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
అయితే.. ఆంధ్రప్రదేశ్ రేపల్లె రైల్వే స్టేషన్‌లో మే 1న ఓ మహిళను గ్యాంగ్ రేప్ చేశారు. భర్తను కొట్టి భార్యను లాక్కెళ్లిన మృగాళ్లు.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కూలీ పనుల కోసం బాధితురాలి కుటుంబం ప్రకాశం జిల్లా నుంచి కృష్ణా జిల్లా నాగాయలంకకు వెళ్తున్నారు. రాత్రి రేపల్లె స్టేషన్‌లో రైలు దిగిన తరువాత.. ఒకటో నెంబర్ ఫ్లాట్‌ఫామ్‌పై పడుకున్నారు. ఆ సమయంలో ముగ్గురు వ్యక్తులు మహిళను ఫ్లాట్‌ఫామ్ చివరకు లాక్కెళ్లి అత్యాచారం చేశారు.
Project K : ప్రభాస్ హిందీ అదుర్స్ అట!