ఒక క్లాస్ కు ఒక టీచర్ కాకుండా కేంద్ర సిలబస్ ప్రకారం సబ్జెక్ట్‌కు ఒక టీచర్ విధానం తీసుకుని వస్తున్నాం.. రాష్ట్రంలో ఒక్క స్కూల్ కూడా మూసివేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసిన కేసులో అరెస్టైన వైసీపీ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ అనంతబాబుకు రిమాండ్ పొడిగిస్తూ రాజమహేంద్రవరం కోర్టు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ నెల 20 వరకు అనంతబాబు రిమాండ్‌ను పొడిగిస్తున్నట్లు కోర్టు సోమవారం ప్రకటించింది. అంతేకాకుండా అనంతబాబు బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టనున్నట్లు ఎస్సీ,ఎస్టీ కోర్టు వెల్లడించింది. అయితే ఇప్పటికే.. సుబ్రహ్మణ్యాన్ని తానే చంపినట్లు అనంతబాబు ఒప్పుకున్నారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేయగా… ఆయనను…
బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం నడ్డాకు పండితులు వేదాశీర్వచనం చేశారు. ఆ తర్వాత ప్రసాదం, చిత్రపటాని ఆయనకు అందజేశారు. ఎప్పటినుంచో జగన్మాత కనకదుర్గమ్మ దర్శనానికి రావాలని అనుకున్నానని.. ఇప్పటికి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. దుర్గమ్మ కరుణ కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారి ఆశీస్సులతో మంచి పాలన అందాలని కోరుకున్నారు. KA PAUL:…
మా ఇంట్లో కుక్క పిల్ల తప్పిపోయింది వెతికిపెట్టండి. మా ఇంట్లో పిల్లి కనిపించడం లేదు. మా ఇంట్లో నెక్లెస్ పోయింది.. వాళ్ళ మీద అనుమానంగా వుంది. ఆ సంగతి చూడండి అంటూ పోలీసులకు కంప్లైంట్లు రావడం కామన్. అసలే రాజకీయంగా ఎవరిమీద కేసులు పెట్టాలి, అధికార పార్టీ నేతల నుంచి వచ్చే కంప్లైంట్స్ పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న రోజులివి. దానికి తోడు ఇతర నేరవార్తలు వారిని నిలువ నీయకుండా చేస్తుంటాయి. బంగారు, నగదు దోచుకెళ్లారని…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలో ఎమ్మెల్సీ కారులో మృతదేహం ఉండటం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. అది వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు వద్ద గతంలో డ్రైవర్‌గా పని చేసిన వీధి సుబ్రహ్మణ్యం మృతదేహంగా పోలీసులు గుర్తించారు. అర్థరాత్రి యాక్సిడెంట్ అయ్యిందని చెప్పి డ్రైవర్‌కి సమాచారం ఇచ్చిన ఎమ్మెల్సీ.. యంగా ఆయనే తన కారులో తెల్లవారు జామున రెండు గంటలకు మృతదేహాన్ని తీసుకొచ్చారు. డ్రైవర్ తల్లిదండ్రులు ఆందోళనకు దిగడంతో.. బాడీని, తన కారుని అక్కడే వెదిలేసి, మరో…
నగరంలో రోజు రోజుకూ మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో మహిళ రక్షణ ప్రశ్నార్థకంగా మారుతోంది. పటిష్ట నిఘా ఉన్నా.. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు పెట్టిన.. పోలీస్ యంత్రాంగా 24 గంటలు అలర్ట్ గా ఉన్నా.. కామాంధులు రెచ్చిపోతున్నారు. ఈ మధ్య కాలంలో అత్యాచారాలు, హత్యలు.. లైంగిక వేధింపుల ఘటనలు పెరుగుతున్నాయి. గుడిలోనూ, బడిలోనూ, ఆస్పత్రుల్లోనూ మహిళలకు రక్షణ లేకుండో పోతోంది. మైనర్ నుంచి ముసలి వయసు వరకు.. మహిళ అంటే చాలు కిరాతకులు రెచ్చిపోతున్నారు. కామవాంఛలతో…
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రేపు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన గణపవరంలో ‘వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఉదయం 10.10 గంటలకు గణపవరం చేరుకోనున్న సీఎం.. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ‘వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం డిగ్రీ కాలేజీ మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం ముగిశాక తిరిగి 1 గంటకు తాడేపల్లికి…
పదో తరగతి ప్రశ్నాపత్రల లీకేజ్ వివాదంలో అరెస్టైన మాజీ మంత్రి నారాయణ, బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే! ఈ బెయిల్‌పై తమ పోలీస్ శాఖ ఉన్నత న్యాయస్థానానికి అప్పీలుకు వెళ్ళనుందని చిత్తూరు ఎస్పీ కార్యాలయం ప్రకటన చేసింది. పదవ తరగతి ప్రశ్న పత్రాల మాల్ ప్రాక్టీస్ విషయంలో లోతైన దర్యాప్తు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, తమ విచారణను మరింత వేగవంతం చేశామని ఆ ప్రకటనలో పేర్కొంది. నారాయణ లాంటి విద్యాసంస్థలు.. విద్యా ప్రమాణాల్ని పక్కనపెట్టి, కేవలం…
ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం మండలం మురారిపల్లెలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శిలాఫలకంలో తమ నాయకుడి పేరు లేకపోవడంతో.. వైసీపీ వర్గాల మధ్య చిచ్చు రేగింది. పోలీసులు రంగంలోకి దిగేదాకా.. ఈ రగడ అదుపులోకి రాలేదు. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఏపీ ప్రభుత్వం ఈరోజు నుంచి రాష్ట్రంలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే! ఇందులో భాగంగా గ్రామంలో స్కూల్ భవన నిర్మాణానికి శిలాఫలకాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. అయితే.. ఆ శిలాఫలకంలో స్కూల్…