Droupadi Murmu: ఏపీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన కొనసాగుతోంది. ఆదివారం నాడు నేవీ డే ఉత్సవాల్లో పాల్గొన్న ఆమె సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా తిరుమల క్షేత్ర సంప్రదాయం ప్రకారం.. వరాహ స్వామి వారిని ఆమె దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి దర్శనానికి ఆలయ మహాద్వారం చేరుకుని అక్కడి నుంచి తిరుమలేశుడి దర్శనానికి వెళ్లారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆలయ ప్రధాన అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రంగనాయకుల మండపంలో…
నేడు నిర్మల్ జిల్లాలో 6వ రోజు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర కొనసాగుతుంది. గుండంపల్లి క్రాస్ రోడ్స్ , దిల్వార్ పూర్, లోలం మీదుగా సిర్గా పూర్ వరకు యాత్ర సాగనుంది.
సిరిసిల్లలో మరోసారి ఫ్లెక్సీల కళకం బండి సంజయ్ పై వ్యంగ్యాస్త్రాలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరోసారి ఫ్లెక్సీల కలకం రేపాయి. సిరిసిల్లలోని పలు కూడళ్లలో బండి సంజయ్ పై వ్యంగ్యాస్త్రాలుతో ఫ్లెక్సీలు పెట్టడంతో బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫ్లెక్సీలో ఏడ్చే మగవాళ్లను నమ్మవద్దని పురాణాలు చెబుతున్నాయి అని ఫ్లెక్సీలో ఉంది. ఓ వైపు బండి సంజయ్ కళ్లలోంచి నీరు కారడం మరో వైపు అమ్మాయి నవ్వుతుండటం ఫోటో పెట్టారు. ఫ్లెక్సీలో నవ్వే ఆడవాళ్లను…
నేడు నల్గొండ జిల్లా దామరచర్లలో పర్యటించనున్నారు. అక్కడ నిర్మితమవుతున్న యాదాద్రి ఆల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను పర్యవేక్షించనున్నారు. ఉదయం 11గంటలకు ప్రగతిభవన్ నుంచి బయల్దేరనున్న సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 12 గంటలకు దామరచర్ల చేరుకుంటారు.