బీజేపీ నిర్వహించే ప్రజాగ్రహ సభ చరిత్రలో బూటకంగా నిలిచిపోతుందని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఉన్న బీజేపీకి ఏపీలో ఉన్న బీజేపీకి చాలా తేడా ఉందని, రాష్ట్రంలో ఉన్న బీజేపీ జగన్ కు అనుకూలంగా పనిచేస్తోందని ఆయన ఆరోపించారు.పశ్చిమబెంగాల్ లో చీమ చిటుక్కుమన్నా కేంద్ర హోంమంత్రి వెళతారని, ఏపీలో ఏమి జరిగినా కేంద్రం మాట్లాడటం లేదని ఆయన అన్నారు. కేంద్రం టెలిస్కోప్ లో రాష్ట్ర రాజకీయలను చూస్తుందని కేంద్ర…
విపక్షాలపై వైసీపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో విపక్షాలు సిద్ధాంతాలను పక్కన పెట్టి ఏకమై రాజకీయాలు చేస్తున్నాయని ఆయన అన్నారు. అంతేకాకుండా సీఎం జగన్‌కు ప్రజలు అండగా నిలబడ్డారని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ప్రజలు నీరాజనం పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఓటీఎస్ వరంలాంటిదని ఆయన అభివర్ణించారు. ఏకకాలంలో ఇంటిపై పూర్తి హక్కును పొందేలా జగన్ తీసుకువచ్చిన ఓటీఎస్‌పై ప్రజల్లో దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.…
మద్యంపై పన్ను రేట్లలో మార్పులు చేస్తూ మరోమారు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యాట్, అదనపు ఎక్సైజు డ్యూటీ ప్రత్యేక మార్జిన్లల్లో హేతుబద్దత కోసం ఏపీ ప్రభుత్వం మార్పులు చేపట్టింది. ఈ నేపథ్యంలో వ్యాట్, అదనపు ఎక్సైజు డ్యూటీలో హేతుబద్దత ద్వారా రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గనున్నాయి. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ వెరెటీలపై 5-12 శాతం మేర ధరలు తగ్గే అవకాశం ఉండగా, ఇతర అన్ని కేటగిరీల మద్యంపై 20 శాతం వరకూ ధరలు…
ఏపీలో మరోసారి టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. రైతు రుణ విముక్తి విషయంలో ఏమి జరిగిందో, లక్ష కోట్లు 20 వేల కోట్లు ఎలా అయ్యాయో అందరికీ తెలుసునని అన్నారు. అంతేకాకుండా మీడియా ముసుగులో దశబ్దాలు తరబడి టీడీపీ కోసం రౌడీయిజం, రుబాబు చేస్తున్నారని, చంద్రబాబు వస్తే అంతా ప్రశాంతంగా ఉంటుంది అంటూ ప్రచారం చేస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి పథకాలను రోజూ…
ఏపీలో ఇటీవల ఎన్నికైన 11 మంది కొత్త ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం కార్యక్రమం మండలిలో జరుగుతోంది. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. మండలిలో బలం ఉందని ప్రతిపక్షం ఎలా వ్యవహారించిందో చూశామని, ఈ రోజు శుభదినమన్నారు. పార్టీని నమ్ముకున్న వారికి జగన్ తప్పక న్యాయం చేస్తారనడానికి ఇదే నిదర్శనమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రతి ఎన్నికల్లో విజయం సాధిస్తున్నామని, నేతల మధ్య విభేదాలున్నా కలిసి కట్టుగా పని చేసి, ప్రజల…
విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి అవంతి శ్రీనివాస్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ.. భీమిలిలో భూ సంబంధిత సమస్యలు ఎక్కువగావున్నాయని వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఎండోమెంట్ భూములను రెగ్యులరైజ్ చేయడానికి ప్రభుత్వానికి అధికారం లేదని, భీమిలీలో పదివేల మందికి పైగా ఇళ్లపట్టాలిచ్చామని పేర్కొన్నారు. ఓటీఎస్ పై ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కడుతున్నారని ఎవరినీ బలవంతం పెట్టడం లేదని ఆయన తెలిపారు. ఓటీఎస్ కట్టని వారికి…
ఏపీలో వరి వార్ మొదలైంది. తెలంగాణలో వరి వేయవద్దంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలతో గందరగోళం నెలకొంది. ఏపీలో కూడా వరి వేయవద్దంటూ అధికారి వైసీపీ నేతలు చెప్పడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిపై స్పందించిన టీడీపీ నేత, మాజీ మంత్రి జవహార్ సీఎం జగన్, వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జవహర్ మాట్లాడుతూ.. జగన్ చర్యలతో వ్యవసాయం కుదేలైందని, సీఎం జగన్ ఏపీలో వరిపంటకు ఉరివేశాడంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు.…
అండమాన్‌లో ఏర్పడ్డ అల్పపీడనం కాస్త వాయుగుండంగా బలపడి తుఫాన్‌గా మారింది. ఈ తుఫాన్‌కు జవాద్ తుఫాన్‌గా అధికారులు నామకరణం చేశారు. దీంతో ఈ జవాద్ తుఫాన్ ఎఫెక్ట్ ఉత్తరాంధ్ర, ఒడిషా రాష్ట్రాలపై ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం తీర ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాకుండా తుఫాన్ తీవ్రత తగ్గేవరకు విశాఖపట్నంలోని పర్యాటక కేంద్రాలను మూసివేస్తున్నట్లు, సందర్శకులు రావద్దంటూ ప్రకటించింది. అయితే ఇటీవల జవాద్ తుఫాన్ విశాఖపట్నంకు…
మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాలతో ఏపీలోని పలు జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చి సహాయక చర్యలు అందించారు. వాగులు, వంకలు పొంగిపొర్లి వరద నీరు గ్రామాల్లోకి చేరింది. అంతేకాకుండా చెరువులకు గండ్లు పడడంతో కట్ట కింద ఉన్న పంటపొలాలు కొట్టుకుపోయాయి. పశువులు కూడా కొట్టుకుపోయి తీవ్ర ఆస్తినష్ట, ప్రాణ నష్టం కూడా సంభవించింది. దీంతో సీఎం జగన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు,…