ఏపీ హైకోర్టు సూచనల మేరకు ఏపీ ప్రభుత్వ కీలక ఆదేశాలు జారీ చేసింది. అఖిక భారత న్యాయవాదుల సంఘం దాఖలు చేసిన పిల్ పై విచారణలో హైకోర్టు కీలక సూచనలు చేసింది. దీనిపై ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం. కోవిడ్ నోడల్ ఆఫీసర్ విధులు నిర్ధారించింది ఏపీ వైద్య ఆరోగ్య శాఖ. అయితే రోగుల నగదు చెల్లింపులు నోడల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో జరగాలని హైకోర్టు తెలపగా ఆదేశాల్లో ఇదే స్పష్టం చేసింది ప్రభుత్వం. రోగులకు బిల్లులు ఇచ్చేముందుగా నోడల్…
కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు కోసం న్యాయపోరాటానికే దిగేవారి సంఖ్య కూడా పెరిగిపోతోంది.. ఇప్పటికే ఆనందయ్యకు వ్యతిరేకంగా కొంత.. అనుకూలంగా చాలా వరకు సోషల్ మీడియాలో మద్దతు లభిస్తుండగా.. వెంటనే ఆనందయ్య తయారు చేసిన కరోనా మందు పంపిణీ చేయాలంటూ.. అనంతపురానికి చెందిన ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు.. మరోవైపు.. ఆ మందు పంపిణీపై హైకోర్టులో మరో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది.. కరోనా బాధితులకు వెంటనే మందు పంపిణీ జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ పేర్కొన్నాడు..…
కరోనా విజృంభిస్తోన్న సమయంలో.. ఆనందయ్య కరోనా మందు పంపిణీ చేయడం.. దానిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేపట్టడంతో.. మందు తయారీ, పంపిణీ ఆగిపోయాయి.. అయితే, చాలా మంది ఆనందయ్యకు సపోర్ట్ చేస్తున్నారు.. ప్రభుత్వం వెంటనే ఆనందయ్యతో మందు పంపిణీ చేయించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.. మరోవైపు.. ఆనందయ్య ఆయుర్వేద మందు కొనసాగించాలని కోరుతూ.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు అయ్యింది… అనంతపురానికి చెందిన ఉమా మహేశ్వర నాయుడు అనే వ్యక్తి తరపున పిటిషన్ దాఖలు చేశారు…
కోవిడ్ కేసులు, ప్రభుత్వ చర్యలపై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. రెమిడెసివర్ కేంద్రం నుంచి సరఫరా అవసరానికి సరిపడా జరగటం లేదన్న రాష్ట్ర ప్రభుత్వం… కేంద్రం చెబుతున్న లెక్కలు, సరఫరాలో తేడాలున్నాయని తెలిపింది. ఆక్సిజన్ సరఫరా కేంద్రం నుంచి డిమాండ్ కి సరిపడా జరగటం లేదన్న ప్రభుత్వం… తక్కువ కేసులు ఉన్న టీఎస్ కి 690 టన్నుల ఆక్సిజన్ సరఫరా చేసి, ఎక్కువ కేసులు ఉన్న ఏపీకి 580 టన్నుల ఆక్సిజన్ సరఫరా చేసారని.. 100 టన్నుల…
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కేసు విచారణను వేసవి సెలవుల తర్వాతకు వాయిదా వేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. ఎంపీ రఘురామరాజును రమేష్ ఆసుపత్రి తరలింపు, అక్కడ వైద్య పరీక్షల నిర్వహణపై సీఐడీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ.. ఆయన తరపు న్యాయవాదులు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది.. అయితే, సుప్రీంకోర్టు.. రఘురామను ఆస్పత్రికి తరలింపు అంశంపై ఉత్తర్వులు ఈరోజే ఇచ్చిందని ఈ సందర్భంగా న్యాయమూర్తికి తెలిపారు ఏఏజీ..…
ఏపీ హైకోర్టులో నేడు కీలక కేసుల విచారణ జరగనుంది. కోవిడ్ పరిస్థితులు, ప్రభుత్వ చర్యలపై దాఖలైన 5 పిటిషన్ల పై విచారణ జరపనుంది కోర్టు. అలాగే రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక సంభవించిన 11 మరణాలు , అనంత ఆసుపత్రిలో 12 మరణాలపై సుమోటో కేసులుగా స్వీకరించి విచారణ చేయనుంది. అంతేకాకుండా సంగం డైరీ చైర్మన్ ధూళిపాళ్ల, ఎండి గోపాల కృష్ణ బెయిల్ పిటిషన్ల పై విచారణ చేయనుంది హైకోర్టు. చూడాలి మరి ఈ కేసులో ఏ…
నా భర్తకు ప్రాణహాని ఉందని ఆరోపించారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు భార్య రమ.. మీడియాకు ఓ వీడియోను విడుదల చేసిన ఆమె.. నా భర్తకు ఏం జరిగినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్, సీఐడీ బాధ్యత వహించాలన్నారు.. ఈ రాత్రి జైలులో ఆయనపై దాడి చేస్తారనే సమాచారం ఉందంటూ అనుమానాలు వ్యక్తం చేసిన ఆమె.. వైసీపీ ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని పేర్కొన్నారు.. ఇక, సీఐడీ ఆఫీసులో పోలీసులు తన భర్తను చిత్రహింసలకు గురిచేశారని…
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యవహారం క్షణ క్షణం ఉత్కంఠ రేపుతూనే ఉంది.. నన్ను తీవ్రంగా కొట్టారంటూ కోర్టుకు తెలిపారు రఘురామ.. దీనిపై మెడికల్ బోర్డును ఏర్పాటు చేసింది హైకోర్టు.. అయితే, దీనిపై ఇవాళ విచారణ సందర్భంగా.. జీజీహెచ్ ఇచ్చిన మెడికల్ రిపోర్టును చదివి వినిపించింది డివిజన్ బెంచ్.. రఘురామ కాలి పై గాయాలు ఏమీ లేవని స్పష్టం చేసింది మెడికల్ రిపోర్టు.. అవన్నీ తాజా గాయాలు కావని పేర్కొంది. రఘురామ పూర్తి ఆరోగ్యంగా…
నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజును ఎందుకు జైలుకు తరలించారని సీఐడీని ప్రశ్నించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. రఘురామ కృష్ణంరాజు కేసులో హైకోర్టులో ప్రారంభమైన వాదనలు కాసేపటి క్రితమే ముగిశాయి.. రఘురామ కృష్ణంరాజు ఆరోగ్య పరిస్థితిపై జిల్లా కోర్టు నుంచి వైద్య బృందం నివేదిక హైకోర్టుకు చేరింది.. దీనిపై హైకోర్టులో విచారణ జరిగింగి.. ఈ సందర్భంగా జరిగిన పరిణామాలను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు రఘురామ తరపు న్యాయవాదులు.. ఇదే సమయంలో.. సీఐడీ కూడా అన్ని విషయాలను కోర్టుకు వివరించింది. హైకోర్టు…