ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై శనివారం హైకోర్టులో విచారణ జరిగింది. పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన హామీని అమలు చేయడం లేదని పేర్కొంటూ అమలాపురానికి చెందిన న్యాయవాది రమేష్ చంద్రవర్మ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా విచారణ చేపట్టిన కోర్టు… ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి గల కారణాలేంటో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు.. ఏపీకి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించింది.…
గురజాల, దాచేపల్లి మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో అధికార పార్టీ నేతల తీరును తప్పు పడుతూ కోర్టుకు వెళ్లారు అభ్యర్ధులు. ఎన్నికల తీరును వెబ్ కాస్టింగ్ ద్వారా టెలికాస్ట్ చేయాలని, టీడీపీ అభ్యర్థులు, ఓటర్లకు రక్షణ కల్పించాలని హైకోర్టులో టీడీపీ అభ్యర్థులు పిటిషన్ వేశారు. టీడీపీ అభ్యర్థులు, పోలింగ్ బూత్, ఓటర్లకు పోలీసులతో పూర్తి స్థాయిలో భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసారు. ఎన్నికల తీరును వెబ్ కాస్టింగ్ ద్వారా అధికారులు…
ఏపీ సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభికి బెయిల్ మంజూరైంది. పట్టాభికి బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. సదరు పిటిషన్‌పై శనివారం మధ్యాహ్నం విచారణ జరిగింది. పట్టాభి అరెస్టుకు సంబంధించి పోలీసులు సరైన విధానం పాటించలేదని హైకోర్టు ప్రశ్నించింది. ముందుకు అరెస్ట్ చేస్తున్నట్లు నోటీసులు ఎందుకు జారీ చేయలేదని కోర్టు నిలదీసింది. ఈ అంశంపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసేందుకు హైకోర్టు సమయం…
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు ఊరట లభించింది… ఈనెల 2వ తేదీన ఐదుగురు ఐఏఎస్‌లకు శిక్ష విధిస్తూ సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పు ఇచ్చారు.. అయితే.. సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన ఆదేవాలను నిలిపివేసింది డివిజన్ బెంచ్.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్, ఐఏఎస్ అధికారి ముత్యాల రాజు, శేషగిరి బాబు, కెవీఎన్ చంద్రధర్ బాబు వేసిన అప్పీల్‌ను స్వీకరించిన హైకోర్టు.. భూ పరిహారం పూర్తిగా అప్పటికే చెల్లించడంతో పాటు తమవంతుగా…
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. టీటీడీ పాలక మండలిలో 52 మంది ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ ప్రభుత్వం జీవోను జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై హైకోర్టులో వేసిన పిటిషన్ పై ఈరోజు విచారణ జరిగింది. ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను కొట్టివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. టీటీడీలో జంబో బోర్డును నియమించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో…
న్యాయవ్యవస్థపై, న్యాయమూర్తులపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో మరో ఛార్జిషీట్ దాఖలు చేసింది సీబీఐ.. విజయవాడలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు అధికారులు.. ఈ ఛార్జిషీట్లో నలుగురిపై అభియోగాలు నమోదు చేసింది సీబీఐ.. ధనిరెడ్డి కొండారెడ్డి, పాముల సుధీర్, ఆదర్శ రెడ్డి, లవునిరు సాంబశివారెడ్డిలపై అభియోగాలు మోపింది.. ఇక, ఈ కేసులో మరో 16 మంది పేర్లను ఛార్జిషీట్లో పొందుపర్చింది సీబీఐ.. కాగా, ప్రభుత్వానికి సంబంధించిన కేసుల్లో తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులపై సోషల్ మీడియా వేదికగా…
ఆంధ్రప్రదేశ్‌లో వినాయక చవితి ఉత్సవాల విషయంలో ప్రభుత్వ వైఖరిపై విమర్శలు వస్తున్నాయి.. ప్రతిపక్షాల నేతలే కుండా హిందూ సంఘాలు కూడా ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి.. కొన్ని ప్రాంతాల్లో నిరసన, మౌన దీక్షలు సైతం చేపట్టారు. అయితే, వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ హైకోర్టు.. వినాయక చవితి ఉత్సవాలపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు అయ్యింది.. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. ప్రైవేటు స్థలాల్లో వినాయక ఉత్సవాలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది.…
వైఎస్ఆర్ చేయూతపై హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బట్టుదేవానంద్ బెంచ్ ముందు ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ శ్రీరాం… వైఎస్ఆర్ చేయూత అనేది రాష్ట్ర ఆర్థిక విధానం, ఆర్థిక సమర్థతకు సంబంధించిన అంశాల్లో ఒకటి. అందువల్ల ఈవ్యవహారంలో కోర్టులకుండే పాత్ర పరిమితం పథకానికి అర్హులు ఎవరు? అమలు ఎలా? అనే అంశాల్లో కోర్టుల పాత్ర పరిమితం. పెద్ద సంఖ్యలో మహిళలు ఈపథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ప్రతి ఏటా వరుసగా నాలుగు సంవత్సరాలు వారి…
రాష్ట్రంలో ఐదుగురు ఐఏఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది ఏపీ హైకోర్టు. ఆ ఐదుగురు ఐఏఎస్ లకు జైలు శిక్షతో పాటుగా జరిమానా విధించింది. ఓ మహిళా భూమి తీసుకొని నష్ట పరిహారం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నెల్లూరు జిల్లా తాళ్లపాక సాయి బ్రహ్మ భూ వ్యవహారంలో తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశించిన తర్వాత కూడా చెల్లింపుల జాప్యం పై సీరియస్ అయ్యింది న్యాయ స్థానం. ఆ ఐఏఎస్ అధికారుల జీతాల నుంచి కట్ చేసి…
75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవాన అంతా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు ఏపీ సీజే అరూప్ గోస్వామి.. హైకోర్టు ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీజే అరూప్ గోస్వామి.. జాతీయ జెండాకు వందనం చేశారు.. ఈ కార్యక్రమానికి జడ్జీలు, ఏజీ శ్రీరాం సుబ్రమణ్యం తదితరులు హాజరు కాగా.. ఈ సందర్భంగా జస్టిస్ అరూప్ గోస్వామి మాట్లాడుతూ.. స్వాతంత్ర్య దినోత్సవాన అంతా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.. స్వాతంత్ర్యం కోసం మహనీయులు చేసిన త్యాగఫలాలను…