ఏపీ హైకోర్టులో నేడు కీలక కేసుల విచారణ జరగనుంది. కోవిడ్ పరిస్థితులు, ప్రభుత్వ చర్యలపై దాఖలైన 5 పిటిషన్ల పై విచారణ జరపనుంది కోర్టు. అలాగే రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక సంభవించిన 11 మరణాలు , అనంత ఆసుపత్రిలో 12 మరణాలపై సుమోటో కేసులుగా స్వీకరించి విచారణ చేయనుంది. అంతేకాకుండా సంగం డైరీ చైర్మన్ ధూళిపాళ్ల, ఎండి గోపాల కృష్ణ బెయిల్ పిటిషన్ల పై విచారణ చేయనుంది హైకోర్టు. చూడాలి మరి ఈ కేసులో ఏ…
నా భర్తకు ప్రాణహాని ఉందని ఆరోపించారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు భార్య రమ.. మీడియాకు ఓ వీడియోను విడుదల చేసిన ఆమె.. నా భర్తకు ఏం జరిగినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్, సీఐడీ బాధ్యత వహించాలన్నారు.. ఈ రాత్రి జైలులో ఆయనపై దాడి చేస్తారనే సమాచారం ఉందంటూ అనుమానాలు వ్యక్తం చేసిన ఆమె.. వైసీపీ ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని పేర్కొన్నారు.. ఇక, సీఐడీ ఆఫీసులో పోలీసులు తన భర్తను చిత్రహింసలకు గురిచేశారని…
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యవహారం క్షణ క్షణం ఉత్కంఠ రేపుతూనే ఉంది.. నన్ను తీవ్రంగా కొట్టారంటూ కోర్టుకు తెలిపారు రఘురామ.. దీనిపై మెడికల్ బోర్డును ఏర్పాటు చేసింది హైకోర్టు.. అయితే, దీనిపై ఇవాళ విచారణ సందర్భంగా.. జీజీహెచ్ ఇచ్చిన మెడికల్ రిపోర్టును చదివి వినిపించింది డివిజన్ బెంచ్.. రఘురామ కాలి పై గాయాలు ఏమీ లేవని స్పష్టం చేసింది మెడికల్ రిపోర్టు.. అవన్నీ తాజా గాయాలు కావని పేర్కొంది. రఘురామ పూర్తి ఆరోగ్యంగా…
నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజును ఎందుకు జైలుకు తరలించారని సీఐడీని ప్రశ్నించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. రఘురామ కృష్ణంరాజు కేసులో హైకోర్టులో ప్రారంభమైన వాదనలు కాసేపటి క్రితమే ముగిశాయి.. రఘురామ కృష్ణంరాజు ఆరోగ్య పరిస్థితిపై జిల్లా కోర్టు నుంచి వైద్య బృందం నివేదిక హైకోర్టుకు చేరింది.. దీనిపై హైకోర్టులో విచారణ జరిగింగి.. ఈ సందర్భంగా జరిగిన పరిణామాలను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు రఘురామ తరపు న్యాయవాదులు.. ఇదే సమయంలో.. సీఐడీ కూడా అన్ని విషయాలను కోర్టుకు వివరించింది. హైకోర్టు…
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది… నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుకు బెయిలు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. కులాల మధ్య చిచ్చుపెట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ శుక్రవారం హైదరాబాద్ లో ఏపీ సీఐడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే కాగా… బెయిల్ కోసం రఘురామకృష్ణం రాజు పెట్టుకున్న హౌస్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. అయితే, ఆయన బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేయడంతో ఆయనకు…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు అరెస్ట్ వ్యవహారంలో ఏపీ రాజకీయాలతో పాటు తెలంగాణ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్‌గా మారాయి… అయితే, ఈ వ్యవహారంలో హైకోర్టును ఆశ్రయించారు ఎంపీ రఘురామకృష్ణంరాజు తరపు న్యాయవాదులు.. దీనిపై స్పందించిన హైకోర్టు.. జిల్లా కోర్టు వెళ్లకుండా నేరుగా హైకోర్టుకు ఎందుకు వచ్చారని ప్రశ్నించింది హైకోర్టు.. అయితే, ప్రాథమిక విచారణ, ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారని హైకోర్టుకు విన్నవించారు రఘురామకృష్ణంరాజు న్యాయవాది.. ఎంపీ హోదాలో ఉన్న వ్యకిని సహేతుక కారణాలు…
ఏపీలో కోవిడ్ పరిస్థితులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అనంతపురం ఆసుపత్రిలో కోవిడ్ మరణాలపై రిపోర్టు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి… అలాగే రాష్ట్ర ప్రభుత్వం కోరిన ఆక్సిజన్ ఇచ్చేలా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఆక్సిజన్ దూర ప్రాంతాల నుంచి కాకుండా రాష్ట్రానికి దగ్గరగా ఉన్న బళ్లారి, తమిళనాడు నుంచి ఇచ్చేలా పరిశీలన చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఆక్సిజన్ స్వయం సమృద్ధికి ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వానికి ప్రశ్నలు వేసింది. కోవిడ్ కేర్…