వైఎస్ఆర్ చేయూతపై హైకోర్టులో విచారణ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్ఆర్ చేయూతపై హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బట్టుదేవానంద్ బెంచ్ ముందు ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ శ్రీరాం… వైఎస్ఆర్ చేయూత అనేది రాష్ట్ర ఆర్థిక విధానం, ఆర్థిక సమర్థతకు సంబంధించిన అంశాల్లో ఒకటి. అందువల్ల ఈవ్యవహారంలో కోర్టులకుండే పాత్ర పరిమితం పథకానికి అర్హులు ఎవరు? అమలు ఎలా? అనే అంశాల్లో కోర్టుల పాత్ర పరిమితం. పెద్ద సంఖ్యలో మహిళలు ఈపథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ప్రతి ఏటా వరుసగా నాలుగు సంవత్సరాలు వారి చేతికే డబ్బు అందుతోంది. లబ్ధిదారులకు వయోపరిమితి అనేది రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విధాన నిర్ణయం. 60 ఏళ్లకు మించిన వారికి వైఎస్ఆర్ చేయూత వర్తించదు. 60 ఏళ్లు దాటితే నియమాలను అనుసరించి వారికి పెన్షన్ అర్హత వస్తుంది. ఈ పథకంపై వస్తున్న అభ్యర్థనలు, మరియు పథకం అమలును ఒకటిగా కలిపి చూడలేం అని అన్నారు.
ఈ చేయూత పథకాన్ని పటిష్టంగా అమలు చేయడానికి అవసరమైన సందర్భాల్లో ప్రభుత్వం జోక్యంచేసుకుంటోంది. కోర్టు వ్యక్తంచేసిన అభిప్రాయాలనుకూడా అంగీకరిస్తున్నాం. పథకం అమలులో ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా ఉన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కూడా పథకాలను అందించాలన్నది విధానం. అంతేకాక అర్హులైన ఏ ఒక్కరికీ కూడా పథకాన్ని నిరాకరించకూడదని స్పష్టంగా చెప్పారు. ఈ విషయంలో తరతమ భేదం చూపరాదని స్పష్టంచేశారు. గత ప్రభుత్వాల్లో ఎప్పుడూ చేయలేని విధంగా ఈ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించి కొన్ని మీడియా కథనాలను కోర్టు పరిగణలోకి తీసుకోవద్దని కోరుతున్నాను. నిరాధారమైన, ధృవీకరించని తప్పుదోవ పట్టించే కథనాలు ఇవి అన్నారు. అర్హత ఉన్నవారు మిగిలిపోతే కనుక కచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోని వారికి ప్రయోజనాలు అందిస్తుంది. చేయూత అమలు విధానంలో ఏమైనా సంక్లిష్టతలు ఉంటే తీసుకోవాల్సిన చర్యలను అధికారులు తీసుకుంటారు. ప్రభుత్వ ఉద్దేశాలను అమలు చేయడానికి, మానవీయ కోణంలో స్పందించేలా తగిన సూచనలు చేస్తాను. లబ్ధిదారులందరికీ కూడా ప్రయోజనాలను అందించాం. కేసును నాలుగు వారాలపాటు వాయిదా వేయాలని ఏజీ కోర్టును కోరారు.
Also Read
- AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆదేశం
- AP Liquor Shops: మద్యం దుకాణాల రెన్యువల్ గడువు పొడిగింపు
- YS Jagan: డీఎస్సీపై సీబీఐ విచారణ అంటే ఎందుకంత భయం..? చంద్రబాబును ప్రశ్నించిన జగన్
- AP JUDA: స్టైపెండ్ పెంపుపై జూడాల అసంతృప్తి.. ప్రభుత్వానికి కోర్టు ధిక్కరణ నోటీసులు
తాజావార్తలు
-
AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆదేశం
-
US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
-
Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: హైదరాబాద్‌కి నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ ఎంట్రీ.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్!
-
AP Liquor Shops: మద్యం దుకాణాల రెన్యువల్ గడువు పొడిగింపు
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!