ఎపి ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్ష నేతగావున్నప్పుడు జరిగిన ఆందోళనలు నిరసనలు కొన్ని ఉద్రిక్త సంఘటనలకు సంబంధించి దాఖలైన 11 కేసులను రద్దుచేయడంపై హైకోర్టు జడ్జి కె.లలిత సుమోటాగా విచారణ చేపట్టడం ఇప్పుడు తాజా వివాదంగా వుంది. ప్రభుత్వాలు మారినపుడు అంతకు ముందరి సాధారణ కేసులు కొన్ని రద్దు చేయడం జరుగుతుంటుంది.వాటినిప్రతిపక్షం ఆక్షేపించడం కూడా జరుగుతుంటుంది గాని ఇక్కడ హైకోర్టు సుమోలాగా తనకు తాను తీసుకోవడవంపైనే ప్రభుత్వం అభ్యంతరం చెబుతున్నది.ఈ కేసుల రద్దులో కొన్ని ప్రభుత్వ జీవోల ద్వారానూ మరికొన్ని పోలీసులు క్లోజ్ చేయడంతోనూ జరిగింది.ఈక్రమంలో కిందిస్థాయి న్యాయమూర్తులు నిబంధనలు పాటించలేదన్నది ఇక్కడ హైకోర్టుఫిర్యాదుగా కనిపిస్తుంది.హైకోర్టులో న్యాయవిభాగం, పాలనా విభాగం రెండూ వుంటాయి.నిబంధనల పాటింపు లాటివి పాలనా విభాగం చూస్తుంటుంది. జగన్‌పై కేసుల ఉపసంహరణ విషయంలో పాలననావిభాగం చెప్పడం దాన్ని నన్యాయ విభాగం సుమోటాగా తీసుకోవడం లాటివి గతంలో జరగలేదని అడ్వకేట్ జనరల్ శ్రీరాం వాదించారు.అరుదు ఆసాధారణం వంటి పదాలు ఆయన వాడారు గాని చట్టవిరుద్ధం లేదా రాజజ్యాంగ విరుద్ధం అన్నట్టులేరు. ఎందుకంటే పెహౖకోయ్టి ను కోర్ట్ ఆఫ్ రికార్డ్జ్ అంటారు.కింది కోర్టులలో ఏదైనా తప్పుగా జరిగిందని భావిస్తే జజోక్యం చేసుకోవచ్చు.ఇందులో పాలనా విభాగం నవమోదు చేస్తే న్యాయు విభాగం విచారిస్తుంది. అంతేగాని పాలనా విభాగమే తీర్పు చెప్పదు.ఇప్పుడు జగన్‌పై కేసుల రద్దుమంచిచెడ్డలను హైకోయ్టి విచారించకపోవచ్చు. నిబంధనల ప్రకారం మళ్లీ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఆదేశించవచ్చు. కనుక ఈ విషయంలో ఇరు పక్షాలు కూడా అతిగా స్పందించాల్సిన అవసరమే లేదు. ఇక మీడియాలో పూర్తి రాజకీయ విభజన జరిగిపోయింది గనక కొందరు అటు కొందరు ఇటుసమాచారం ఇవ్వొచ్చు. హైకోర్టు పూర్తి ఆదేశాలులేదా అంతిమ తీర్పు కోసం వేచిచూడటం మంచిది. కేసుల పున:పరిశీలన అనగానే షాక్ అని మరొకటి అని హడావుడిద పడనక్కర్లేదు.
రాజకీయంగా వైసీపీ ప్రభుత్వం గతంలో చంద్రబాబు ప్రభుత్వం కూడా కేసులను ఎలా రద్దు చేసిందో వివరాలు విడుదల చేసింది.2017 ఆగష్టులో ఈమేరకు 21జీవోలు ఇతరాలు అందులో వున్నాయి. వాటిపై అప్పట్లో మీడియాలో వ్యాఖ్యలు కూడా వచ్చాయి. అప్పటి ఉపవముుుఖ్యముంత్రులు చినరాజప్ప, కెఇకృష్ణముూర్తి ఇప్పటి టిడిపి రాష్ట్ర అద్యక్షుడు అచ్చెం నాయుడు వంటివారందరి పైనా వున్న కేసులు ఉపసంహరించారు. తెలంగాణ ఉద్యమ కాలంలో కేసులకు సంబంధించి ఇప్పటికి కెటిఆర్‌తో సపహా మంత్రులు కోర్టులకువెళుతూనే వుంటారు. కొన్ని రద్దయిపోతుంటాయి.కమ్యూనిస్టులైతే నిరంతరం హాజరవుతూనే వుంటారు. గుజరాత్ మారణహోమం సందర్భంలో స్వయంగాఇప్పటిప్రధాని మోడీ హోంమంత్రి అమిత్‌షాతో సహా కేసులుఎదుర్కొని అనేక దశల్లో రకరకాలుగా బయిటపడిన వారే.పాలకపార్టీలు ప్రభుత్వాలు పరిపాటిగా చేసే ఈ చర్య పెద్ద రాజ్యాంగ రాజకీయసమస్యలకు దారి తీయకపోవచ్చు. పైగా కోర్టులలోనూ దశలవారిగా అప్పీలు చేసుకునే అవకాశం వుండనే వుంటుంది. కనుక దీనిపై శ్రుతిమించిన వూహాగానాలు అవసరం లేనిపని.