ఆత్మ పరిశీలన అవసరం.. ఏపీ సీజే ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవాన అంతా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు ఏపీ సీజే అరూప్ గోస్వామి.. హైకోర్టు ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీజే అరూప్ గోస్వామి.. జాతీయ జెండాకు వందనం చేశారు.. ఈ కార్యక్రమానికి జడ్జీలు, ఏజీ శ్రీరాం సుబ్రమణ్యం తదితరులు హాజరు కాగా.. ఈ సందర్భంగా జస్టిస్ అరూప్ గోస్వామి మాట్లాడుతూ.. స్వాతంత్ర్య దినోత్సవాన అంతా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.. స్వాతంత్ర్యం కోసం మహనీయులు చేసిన త్యాగఫలాలను సద్వినియోగం చేసుకోవాలి.. నిత్యం స్మరించుకోవావాలి.. కుల, మతాలకు అతీతంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు.
నేషన్ ఫస్ట్.. అల్వేస్ ఫస్ట్ ఇదే నినాదంతో ముందుకెళ్లాలి అని సూచించారు జస్టిస్ అరూప్ గోస్వామి.. ఏడాదిన్నరగా కరోనాతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం.. కోవిడ్ వల్ల అందరి జీవన విధానాలు మార్చుకోవాల్సి వచ్చిందన్నారు. విద్యా సంస్థలు మూతపడ్డాయి.. జన జీవనం స్థంభించిందన్న ఆయన.. వర్క్ ఫ్రమ్ హోం చేయాల్సిన పరిస్థితులు వచ్చాయని గుర్తుచేశారు.. ఇక, కోవిడ్ సమయంలో న్యాయ వ్యవస్థ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొందని ఈ సందర్భంగా తెలియజేశారు జస్టిస్ అరూప్ గోస్వామి.
Also Read
- UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
- Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ 'అగ్గిపెట్టె మచ్చ' మృతి..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!