కోర్టు ధిక్కరణ అంశంలో ఇద్దరు అధికారులకు జైలు శిక్ష విధించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. ఐఏఎస్ అధికారి గౌరీ శంకర్, ఐఎఫ్‌ఎస్ అధికారి చిరంజీవికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది ఏపీ హైకోర్టు.. 36 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ఈ ఏడాది ఏప్రిల్‌లో స్పష్టం చేసింది హైకోర్టు.. అయితే, ఆ దేశాలను అమలు కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. ఇద్దరు అధికారులకు జైలు శిక్ష విధించింది. అయితే.. కోర్టు ఆదేశాలు అమలు చేస్తామని అధికారులు చెప్పటంతో ఆ తర్వాత వారం రోజుల జైలు శిక్ష ఆదేశాలను రీ కాల్ చేసింది హైకోర్టు.