Somu Veeraju wrotes letter to cm jagan mohan reddy: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సీఎం జగన్‌కు బహిరంగ లేఖ రాశారు. దేవాలయాలకు భక్తులు ఇచ్చిన కానుకలపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆలయాలకు భక్తులు ఇచ్చిన కానుకలు, మొక్కుబడుల సొమ్ములను దేవాలయ నిర్వహణ ఖర్చులకు పోను మిగిలిన సొమ్మును సర్వశ్రేయోనిధికి జమ చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్ ద్వారా ఆలయాల ఈవోలను ఆదేశించారో లేదో హిందూసమజానికి వెల్లడించాలని సోము వీర్రాజు డిమాండ్…
పోలవరం ప్రాజెక్టు వద్ద వరద ఉధృతికి సంబంధించి ప్రమాదకర పరిస్థితులను శుక్రవారం మధ్యాహ్నం జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పరిశీలించారు. అనంతరం ఆయన కీలక ప్రకటన చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యాం ఎత్తును పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. ప్రస్తుతం పోలవరం వద్ద ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. 30 లక్షల క్యూసెక్కుల నీరు వస్తే కాఫర్ డ్యామ్ వద్ద పరిస్థితి ఆందోళనకరంగా మారుతుందని తెలిపారు. అందుకే పటిష్ట చర్యలు…
వైసీపీ ప్లీనరీలో టీడీపీ అధినేత చంద్రబాబు వేలి ఉంగరంలో చిప్ ఉండటంపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల కష్టాలను అర్థం చేసుకుని, వారి బాగోగుల గురించి ఆలోచించే చిప్ మెదడు, గుండెలో ఉండాలి కానీ.. చంద్రబాబు చేతి రింగులోనో, మోకాలిలోనో, అరికాలిలోనో ఉంటే లాభం ఉండదని జగన్ వ్యాఖ్యానించారు. గుండె, మెదడులోనూ చిప్ ఉంటే.. అప్పుడే ప్రజలకు మంచి చేసే ఆలోచనలు వస్తాయన్నారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన చంద్రబాబుకు ఎప్పుడూ లేదని జగన్…
కాంగ్రెస్ పార్టీపై వైసీపీ ప్లీనరీలో సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ఓదార్పు యాత్ర చేయవద్దన్న పార్టీని తాను వ్యతిరేకించినందుకు తనపై అక్రమ కేసులు పెట్టారని జగన్ ఆరోపించారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు దేశంలోని శక్తివంతమైన వ్యవస్థలను తనపై ఉసిగొల్పాయని.. అన్యాయమైన ఆరోపణలు చేయించి కేసులు పెట్టించి అరెస్ట్ చేయించారన్నారు. ఆనాడు వాళ్లకు లొంగిపోయి ఉంటే ఈనాడు జగన్ మీ ముందు ఇలా ఉండేవాడు కాదని వ్యాఖ్యానించారు. తనను టార్గెట్ చేసిన పార్టీ ఈరోజు నామరూపాల్లేకుండా పోయిందని…
ఆంధ్రప్రదేశ్‌లో 292 ఉన్నత పాఠశాలలను హైస్కూల్ ప్లస్‌గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్… హై స్కూల్ ప్లస్ పాఠశాలలను.. బాలికలకు ప్రత్యేకంగా కేటాయిస్తూ ఆదేశాలిచ్చారు. హై స్కూల్ ప్లస్ పాఠశాలల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీలలో రెండు కోర్సులు మాత్రమే అందించనున్నట్టు స్పష్టం చేసింది. స్థానికంగా ఉన్న డిమాండ్‌ను అనుసరించి కోర్సులు నిర్దారించాలని నిర్ణయించింది ప్రభుత్వం… పీజీటీ సమాన స్థాయి అధ్యాపకులనే బోధనకు తీసుకోనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. 1,752 స్కూల్ అసిస్టెంట్లను 292 జూనియర్ కళాశాలల్లో…
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు వాలంటీర్ల ఖాతాల్లో ప్రతినెలా ప్రత్యేకంగా డబ్బులు జమ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న న్యూస్ పేపర్ కొనుక్కునేందుకు ప్రతి నెల రూ.200 చొప్పున ఇవ్వనుంది. దీని ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సమకాలీన అంశాల గురించి గ్రామ, వార్డు వాలంటీర్లు తెలుసుకోవచ్చని జగన్ ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. అంతేకాకుండా న్యూస్ పేపర్ ద్వారా సమకాలీన అంశాల గురించి తెలుసుకుని దుష్ప్రచారాలను తిప్పికొట్టి ప్రజల…
సాంకేతిక సమస్య వల్ల జీపీఎఫ్ ఖాతాల్లో క్రెడిట్-డెబిట్ లావాదేవీలు జరిగాయని పేర్కొంది సర్కార్.. జీపీఎఫ్ ఖాతాల గందరగోళంపై నివేదిక ఇచ్చారు డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్
తనపై ఏపీ ప్రభుత్వం మరోసారి సస్పెన్షన్ విధించడాన్ని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాక్షులను ప్రభావితం చేస్తున్నారనే అభియోగంపై సస్పెండ్ చేస్తున్నట్టు జీవో ఇచ్చారని..ఛార్జీ షీట్ లేదు.. ట్రయల్ లేదు.. అయినా తాను సాక్షులను ప్రభావితం చేయడమేంటని ప్రశ్నించారు. ఏమీ లేని దానికి తనను సస్పెండ్ చేస్తూ జీవో ఇచ్చారని.. తనను మళ్లీ సస్పెండ్ చేయాలనే సలహా ఏ తీసేసిన తహసీల్దార్ ఇచ్చారో..? ఏ పనికి మాలిన సలహాదారు…