Somu Veeraju wrotes letter to cm jagan mohan reddy: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సీఎం జగన్‌కు బహిరంగ లేఖ రాశారు. దేవాలయాలకు భక్తులు ఇచ్చిన కానుకలపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆలయాలకు భక్తులు ఇచ్చిన కానుకలు, మొక్కుబడుల సొమ్ములను దేవాలయ నిర్వహణ ఖర్చులకు పోను మిగిలిన సొమ్మును సర్వశ్రేయోనిధికి జమ చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్ ద్వారా ఆలయాల ఈవోలను ఆదేశించారో లేదో హిందూసమజానికి వెల్లడించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ పట్ల ప్రభుత్వం అధర్మంగా వ్యవహరిస్తూ, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. భక్తులు కానుకులుగా ఇచ్చిన సొమ్ములో కొంత ఆదాచేసి సంవత్సరాల తరబడి దాచిన పొదుపు మొత్తాలను చిన్న ఆలయాలు ఎఫ్‌డీలలో భద్రపర్చుకుంటే ఆ మొత్తాలన ప్రభుత్వం దోచుకోవడానికి పూనుకోవడం దారుణమని సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: World Emoji Day: ఎమోజీ అంటే ఏంటి? వాటిని ఎందుకు వాడతాం?
సుప్రీంకోర్ట్ ఆదేశాల ప్రకారం రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న ఆలయాలను ప్రభుత్వ పరిధి నుంచి తప్పించాలని వీర్రాజు డిమాండ్ చేశారు. ఆర్ధిక సంక్షోభం నేపథ్యంలో చిన్న చిన్న దేవాలయాల నిధులను కూడా స్వాధీనం చేసుకోవాలని చూడటం దారుణమన్నారు. ఔరంగ జేబు, నైజాం నవాబు కూడా చేయని విధంగా ఆలయాల సొమ్మును దోచేయడం నీతిమాలిన చర్యగా భావిస్తున్నానంటూ మండిపడ్డారు. ఆలయాల విషయంలో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్న అనుమానాలు బలపడే విధంగా ప్రభుత్వ ఆదేశాలు కనపడుతున్నాయని.. ప్రభుత్వం ఈ వైఖరిని మార్చుకోవాలని సోము వీర్రాజు లేఖలో డిమాండ్ చేశారు.హిందూ దేవాలయాల నిధులు కాజేసే ఘటన ఖచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని.. ఏ దేవాలయాన్ని ముట్టుకున్నా తీవ్ర పరిణామాలను చూడాల్సి వస్తుందని హెచ్చరించారు.