Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వ దాష్టీకాలపై మహిళలు ధైర్యంగా పోరాటం చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో సమస్యలు చెప్పడం నేరమా అని ఆయన ప్రశ్నించారు. వరద బాధితులను ఆదుకోవాలని కోరితే బూతులు తిడతారా అంటూ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. వరద బాధితుల సమస్యలపై మాట్లాడిన పలువురు జనసేన వీర మహిళలను శనివారం నాడు ఆయన సత్కరించారు. కోనసీమ జిల్లా గంటి పెదపూడిలో వరద బాధితుల సమస్యలను జనసేన వీరమహిళలు సీఎం జగన్ దృష్టికి…
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి "నేను ఉన్నాను.. నేను విన్నాను" అని నమ్మబలికి అధికారంలోకి వచ్చారని బీజేపీ రాష్ట్ర ప్రధాని కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. యువమోర్చా సంఘర్షణ యాత్రలో పాల్గొనడానికి చిత్తూరుకు వచ్చిన ఆయన రాష్ట్ర సర్కారుపై విమర్శనాస్త్రాలను సంధించారు.
Atchannaidu Allegations on AP Government: ఏపీ ప్రభుత్వంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. గత మూడేళ్లలో ఏపీలో ఎన్నో అరాచకాలు జరిగాయని.. దళితులపై దాడులు, ఆడపిల్లలపై అత్యాచారాలు, కల్తీ మద్యం, ప్రతిపక్షాల నాయకులు, కార్యకర్తలపై డాడులు జరిగాయని అచ్చెన్నాయుడు ఆరోపించారు. భూ కబ్జాలు, మైనింగ్ మాఫియా, శ్యాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, మట్టి మాఫియా, కోర్టు ధిక్కారాలు, చెత్త రోడ్లు ఇలా…
Bjp Leader Vishnu Vardhan Reddy Comments On AP Government: ఏపీ ప్రభుత్వ విధానాలపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు విద్యార్థులకు శాపంగా మారాయని దుయ్యబట్టారు. ప్రణాళిక లేకుండా స్కూళ్లు మూసివేయడం సరికాదన్నారు. మూడు కిలో మీటర్లు వెళ్లి పిల్లలు చదువుకుంటారా అని ప్రశ్నించారు. ఒకే గదిలో మూడు తరగతుల పిల్లలకు పాఠాలు చెప్పడమేంటని నిలదీశారు. ఈ విషయాలను…
pmgkay scheme free rice will distributed from august 1st in andhra pradesh ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) కింద బియ్యం పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవేళ బియ్యం పంపిణీ చేయకపోతే ధాన్యం సేకరణ నిలిపివేస్తామన్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్ హెచ్చరికల నేపథ్యంలో రేషన్ కార్డు దారులకు ఆగస్టు 1 నుంచి ఉచిత బియ్యం పంపిణీ చేస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ ఉచిత బియ్యాన్ని జాతీయ…
Somireddy Chandramohan Reddy: వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘాటైన విమర్శలు చేశారు. జగన్ పాలనలో పంటలపై పెట్టుబడితో పాటు ఎరువుల ధరలు కూడా విపరీతంగా పెరిగాయని సోమిరెడ్డి ఆరోపించారు. టీడీపీ హయాంలో తుఫాన్ సమయంలో నష్టపోయిన రైతులకు అండగా నిలిచామని గుర్తుచేశారు. హెక్టార్ పత్తికి రూ. 15 వేలు, అరటికి రూ. 30 వేలు, చెరకుకు రూ. 15 వేల పరిహారం అందించి ఆదుకున్నామని తెలిపారు. తుఫాన్ కారణంగా గాయపడిన వారికి…
ysrcp mp talari rangaiah comments about debts in ap government: ఇటీవల వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ, జనసేన తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. అప్పుల కారణంగా ఏపీ మరో శ్రీలంక కాబోతుందని ప్రచారం చేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలను వైసీపీ ఎంపీలు తాజాగా ఖండించారు. ఈ మేరకు ఢిల్లీలో వైసీపీ ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ.. ఏపీలో అవినీతి లేని పాలనను జగన్ ప్రజలకు అందిస్తున్నారని స్పష్టం చేశారు. ప్రజలకు వందకు వంద రూపాయలు నేరుగా చేరుతున్నాయని……
Tdp cheif chandrababu comments on helping to Flood victims: గోదావరి నదికి వచ్చిన వరద ప్రజలను అతలాకుతలం చేసింది. ఈ వరద కారణంగా పోలవరం ముంపు గ్రామాల ప్రజల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం చేస్తున్న వరద సాయంపై టీడీపీ అధినేత చంద్రబాబు తనదైన రీతిలో సెటైర్లు వేశారు. నాలుగు ఉల్లిపాయలు, నాలుగు టమాటాలు, నాలుగు బంగాళాదుంపలు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంటోందని చంద్రబాబు ఆరోపించారు. నాలుగంటే నాలుగే.. ఇది…